Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వాణి.. శృంగార రాణి

By:  Tupaki Desk   |   14 March 2018 10:17 AM GMT
ఫోటో స్టోరి: వాణి.. శృంగార రాణి
X
బాలీవుడ్ లో చాలామంది బ్యూటీలు సినిమా ఆఫర్లు ఎలా ఉన్నా కూడా.. తమ లుక్ అండ్ ఫిజిక్ ను జాగ్రత్తగా మెయిన్టయిన్ చేసుకుంటూ.. యువతకు నిద్ర పట్టకుండా చేస్తుంటారు. అలా ప్రస్తుతం చేతిలో పెద్ద పెద్ద ఆఫర్లు లేకపోయినా కూడా.. రేపోమాపో పెద్ద పెద్ద ఆఫర్లు పట్టేందుకు రెడీ ఉండే బ్యూటి ఎవరైనా ఉన్నారా అంటే వాణి కపూర్ పేరే ముందు చెప్పాలి.

అమ్మడు బేఫికరే సినిమాలో ఆరబోసినంత అందం.. అసలు ఇండియన్ వెండితెరపై ఇప్పటివరకు మెయిన్ స్ర్టీమ్ హీరోయిన్లు ఎవ్వరూ ఆరబోసే ఉండరు. ఆ సినిమాలో ఏకంగా లోదుస్తుల్లో కనిపించేసి అరిపించేసిన ఈ సుందరి ఇప్పుడు మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం మరోసారి మ్యాగ్జిమం అందాలతో కవ్వించింది. అదిగో చూస్తున్నారుగా.. తన వయ్యారమైన నడుం ఒంపును ఒక అజంతా శిల్పంలా కనువిందుచేస్తూ.. శృంగారభరితమైన రసాస్వాదనకే ఈ చూపులన్నీ అన్నట్లూ.. అమ్మడు నల్లటి డిజైనర్ బ్రాలో తన సోయగాన్ని దారబోసింది. అయితే సదరు ప్యాంటు బటన్స్ తీసేసి.. మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుందో ఏంటో.

మొత్తానికి పక్కింటి పిల్లగా ఉండే పాత్రతో తెరంగేట్రం చేసిన వాణి.. ఇప్పుడు ఇలా శృంగార రాణిగా కనిపించడం.. ఖచ్చితంగా ఎవ్వరూ ఊహించని అంశం. అయితే ఈమె యశ్ రాజ్ ఫిలింస్ క్యాంపులో మరో సినిమా చేయాల్సి ఉండటంతో.. ఆ డీల్ పూర్తయ్యే వరకు బయటకు రావడం కష్టమేనట. మరి ఆదిత్య చోప్రా ఏ సినిమా ఆఫర్ చేస్తాడో ఏంటో.