Begin typing your search above and press return to search.

నేను సర్జరీ జోలికి వెళ్లలేదండీ!!

By:  Tupaki Desk   |   6 Dec 2016 1:30 PM GMT
నేను సర్జరీ జోలికి వెళ్లలేదండీ!!
X
అందంగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోవడం సినీ యాక్టర్లకు చాలా కామన్. లిస్ట్ తీయాలే గానీ హీరో- హీరోయిన్స్ అనే తేడా లేకుండా చాలామంది ఉంటారు ఈ ప్లాస్టిక్ సర్జరీ జాబితాలో. అయితే ఏ శృతీహాసన్ లాంటి వాళ్లో తప్ప చాలామంది తాము ఫేస్ జాబ్ చేయించుకున్నామనే విషయాన్ని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు సరిగ్గా ఇదే మాట చెబుతోంది బేఫికర్ హీరోయిన్ వాణీ కపూర్.

మూడేళ్ల క్రితం యశ్‌ రాజ్ ఫిల్మ్స్ తీసిన శుద్ దేశీ రొమాన్స్ తో బాలీవుడ్లో అడుగుపెట్టిన వాణీ ఆ తర్వాత తెలుగులో నాని పక్కన ఆహా కళ్యాణంలో కూడా యాక్ట్ చేసింది. సేమ్ బ్యానర్లో రాబోతున్న బేఫికర్ లో రణవీర్ తో రొమాన్స్ చేసింది. ఈ మూవీలో గ్లామర్ పరంగా హద్దులు దాటేసిందని ట్రైలర్స్ చూస్తే అర్థమైపోతుంది. సినిమాలో అందాల ఆరబోత సంగతెలా ఉన్నా బేఫికర్ ఫస్ట్ పోస్టర్ రిలీజైన దగ్గర్నుంచి వాణీకపూర్ లుక్స్ మీద ఒకటే చర్చ. అందంగా కనిపించడానికి వాణీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే అది మిస్ ఫైర్ అయిందని.. బ్యూటీఫుల్ వాణీ కాస్త హ్యాండ్ సమ్ వాణీ అయిందంటూ స్టార్టైన కామెంట్స్ ట్రోలింగ్ వరకు వెళ్లాయ్. ఇన్నాళ్లూ వీటి గురించి పెద్దగా పట్టించుకోని వాణీ.. ఫైనల్ గా రియాక్టైంది.

తాను బరువు తగ్గానే తప్ప ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని వెయిట్ లాస్ ఎఫెక్ట్ ముఖంలో కనిపిస్తోందని.. పైగా బేఫికర్ కోసం చాలా షాట్స్ లో తనని క్లోజప్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించడం వల్ల అలా కనిపిస్తున్నాననే తప్ప సర్జరీ జోలికి పోలేదని తేల్చేసింది. అయినా ఇంకో సినిమా చేస్తున్నానని ఎంకరేజ్ చేయకుండా ఈ పనికిరాని డిస్కషన్స్ ఏంటో అర్థం కావట్లేదని తెగ ఫీలైవుతుంది కూడా. హీరోయిన్స్ అంటే అంతే.. ఎలా కనిపించినా వంకలు పెడతారు. సర్లే వాణి.. బేఫికర్ గా ఉండు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/