Begin typing your search above and press return to search.

మంటలు పెడుతున్న వార్ బ్యూటీ వాణీ

By:  Tupaki Desk   |   8 March 2021 12:30 AM GMT
మంటలు పెడుతున్న వార్ బ్యూటీ వాణీ
X
ఆహా క‌ల్యాణం ఫేం వాణీ క‌పూర్ వ‌రుస పెట్టి య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో న‌టిస్తున్నా చాలా కాలం పాటు బిగ్ బ్రేక్ కోసం వేచి చూడాల్సి వ‌చ్చింది. ఇటీవ‌లే హృతిక్ - టైగ‌ర్ ల‌తో క‌లిసి యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ వార్ లో న‌టించింది. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. అందులో హృతిక్ స‌ర‌స‌న వాణీ రొమాన్స్ అద‌ర‌గొట్టింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్న వాణీ నిరంత‌రం హాట్ ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది. తాజాగా రెడ్ హాట్ ఫ్లోర‌ల్ థై స్లిట్ ఫోటోషూట్ తో అద‌ర‌గొట్టింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. వాణీ నెవ్వ‌ర్ బిఫోర్ కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేస్తోంద‌ని యువ‌త‌రం కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు. స్పార్క్ నుంచి వ‌చ్చే ఫ్లేమ్ లా ఉందిలే! అంటూ వ్యాఖ్య‌ల‌తో వాణీ అందాన్ని పొగిడేస్తున్నారు.

వాణీ కెరీర్ సంగ‌తి చూస్తే.. య‌శ్ రాజ్ ఫిలింస్ లోనే భారీ హిస్టారిక‌ల్ మూవీ `సంషేరా`లోనూ వాణీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కించిన ఈ సినిమాని అంతే భారీగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ ఉన్నా... కోవిడ్ వ‌ల్ల అది వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం య‌ష్ రాజ్ సంస్థ పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది.