Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఆహా క‌ల్యాణ‌మే!

By:  Tupaki Desk   |   7 Feb 2020 4:30 PM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఆహా క‌ల్యాణ‌మే!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస షెడ్యూల్స్ తో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీరామ్ లాయ‌ర్ సాబ్ (వ‌కీల్ సాబ్) తొలి షెడ్యూల్ ని ఇప్ప‌టికే పూర్తిచేసారు. మ‌రో ప‌ది రోజులు పాటు ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ షెడ్యూల్ నుంచి ప‌వ‌న్ ని మిన‌హాయించారు. దీంతో ఇత‌ర న‌టీన‌టుల‌పై చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్నారు. ప‌వ‌న్ ఈలోగానే క్రిష్ తో త‌న 27 చిత్రాన్ని రెగ్యుల‌ర్ షూట్ ని ప‌ట్టాలెక్కించారు. కొండాపూర్ లో జ‌రుగుతున్న షూటింగ్ కు ప‌వ‌న్ హాజ‌రవుతున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది క్రిష్ బృందం ఖ‌రారు చేయ‌లేదు.

కేవ‌లం ప‌వ‌న్ పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌పైనే మేక‌ర్స్ ముందుగా ప్లాన్ చేసుకున్నారు. దీంతో హీరోయిన్ ఎంపిక డిలే అవుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. హీరోయిన్ ఎంపిక ప్ర‌క్రియ కూడా సైలెంట్ గా పూర్తిచేసిన‌ట్లు సమాచారం. ఇది పీరియాడిక్ స్టోరీ కావ‌డంతో పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా బాలీవుడ్ భామ వాణీ క‌పూర్ ని బ‌రిలోకి దించుతున్న‌ట్లు ప్ర‌చార‌మ‌వుతోంది. పాన్ ఇండియా స్టాండార్డ్ అంటే.. ఒక్క టాలీవుడ్ కే ప‌రిమితమైతే స‌రిపోదు..ఇత‌ర భాష‌ల్లోనూ ప‌రిచయం అయిన భామ అయితే బాగుంటుంద‌ని వాణీని ఎంపిక చేశార‌ట‌. పాత్ర ప‌రంగాను వాణీ క‌పూర్ అయితే సూట‌వుతుంద‌ని క్రిష్ అనుకుంటున్నాడుట‌.

ఈ నేప‌థ్యంలో వాణీ క‌పూర్ ను ఎంపిక చేసిన‌ట్లు వినిపిస్తుంది. వాణీ క‌పూర్ టాలీవుడ్ కు కొత్తేం కాదు. నాని హీరోగా న‌టించిన ఆహా క‌ల్యాణం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచానాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఆ త‌ర్వాత ఏ ద‌ర్శ‌క‌- నిర్మాత వాణీ వైపు చూసింది లేదు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు వాణీకి టాలీవుడ్ అవ‌కాశం ఆయాచిత వ‌రంగా మార‌నుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే ఆ మేర‌కు త‌న‌కు ఫాలోయింగ్ పెరిగే ఛాన్సుంటుంది. ఇక వాణీ క‌పూర్ ఇటీవ‌లే హృతిక్ స‌ర‌స‌న వార్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. వాణీ వ‌య్యారాల వ‌డ్డ‌న‌ల‌కు కుర్ర‌కారు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. వార్ ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో త‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కాయి. ఇప్పుడు ప‌వ‌న్ తో ఖాయ‌మైతే టాలీవుడ్ లోనూ వాణీకి అరుదైన ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్టే.