Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్ భలే ఛాన్సు పట్టిందే

By:  Tupaki Desk   |   12 Oct 2017 12:33 PM GMT
నాని హీరోయిన్ భలే ఛాన్సు పట్టిందే
X
బాలీవుడ్ లో యాక్షన్ సీన్స్ తో పాటు డ్యాన్సులతోనూ ఇరగదీసే హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. తాను తీసిన సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా అతను చేసిన పాత్రలు మాత్రం చాలా ఆకట్టుకుంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మకమైన సినిమాలతో కూడా హృతిక్ చాలా ఆకట్టుకుంటాడు. ముఖ్యం క్రిష్ రోల్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేశాడు.

చివరగా కాబిల్ సినిమాతో వచ్చిన హృతిక్ ప్రస్తుతం సూపర్ 30 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సరికొత్త కథను ఒకే చేశాడు హృతిక్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాష్ రాజ్ ఫిలిమ్స్ ఒక భారీ యాక్షన్ సినిమాను నిర్మిస్తోంది. ఆ సినిమాలో హృతిక్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా ఎంపికయ్యారు. అయితే హీరోయిన్ గా వాణి కపూర్ ను ఎంపిక చేశారు. వాణి కపూర్ ఎవరో కాదు నాని హీరోగా తెలుగు -తమిళ్ లో యాష్ రాజ్ వారు తెరకెక్కించిన ఆహా కళ్యాణం సినిమాలోని హీరోయిన్. ఆ సినిమా తర్వాత అమ్మడికి అంతగా ఛాన్సులు రాలేదు.

కానీ గత ఏడాది బేఫిక్రే అనే సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. నటన కంటే కూడా లిప్ కిస్సులు అలాగే గ్లామర్ డోస్ తో బాగా పాపులర్ అయిపోయింది. దీంతో హృతిక్ రోషన్ తో నటించే ఛాన్స్ దొరికింది. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ విషయాన్ని తెలిపాడు.