Begin typing your search above and press return to search.
వారసుడు బాక్సాఫీస్.. ఇదే ఆఖరి ఛాన్స్!
By: Tupaki Desk | 22 Jan 2023 11:30 AM GMTతమిళ స్టార్ విజయ్ హీరోగా... డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభోత్సవం సమయంలో సినిమాని తెలుగు, తమిళ బైలింగువల్ మూవీగా తెరకెక్కిస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అయితే తర్వాత ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ... ఈ సినిమా తమిళంలో తెరకెక్కుతుందని... తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అలా అనుకున్నట్లుగానే విజయ్ మార్కెట్ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బిజినెస్ 14 కోట్ల రూపాయలకైంది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 15 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇంకా కోటి 73 లక్షలు వసూలు చేస్తే కానీ... బ్రేక్ ఈవెన్ అవ్వదు అంటే... ఇంకా కోటి 73 లక్షలు వసూలు చేస్తే తప్ప ఈ సినిమా లాభాల బాట పట్టదని చెప్పాలి. అయితే ఇదే చివరి వీకెండ్ కావడంతో పాటుగా మరో వారం ఆగితే కొత్త సినిమాలు ఎంట్రీ ఇస్తాయి. వాటికి థియేటర్లు వెళ్లిపోతాయి. కాబట్టి ఈ కోటి 73 లక్షలు వసూలు అయితే కనుక... ఈరోజు ఒక్క రోజులోనే వసూలు అవ్వాల్సి ఉంటుంది.
శనివారం వసూళ్లు ఇంకా కలపలేదు కాబట్టి... అవి కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద దిల్ రాజు ఎంతో నమ్మకంతో చేసిన ఈ వారసుడు ప్రాజెక్టు మాత్రం కొంప ముంచిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు తమిళంలో అజిత్, విజయ్ సినిమాలు రిలీజ్ అయితే... విజయ్ సినిమాలు ముందంజలో.. కలెక్షన్స్ విషయంలో ఉండేవి. కానీ ఈ సారి మాత్రం వెనకబడిపోయింది. తెలుగులో కూడా అంతంతమాత్రంగానే కలెక్షన్స్ రాబట్టింది.
అజిత్ సినిమాతో పోలిస్తే తెలుగులో కాస్త వసూళ్లు ఎక్కువే రాబట్టింది. కానీ వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు అసలు లెక్కలోకి రావని చెప్పాలి. అయినా ఇంకా ఈ సినిమా ఈ కాస్త డబ్బును వెనక్కి తెచ్చి దిల్ రాజుని రెండు తెలుగు రాష్ట్రాలలో సేఫ్ జోన్ లో పడేస్తుందా లేదా అనేది చూడాలి.