Begin typing your search above and press return to search.
`వారసుడు`: నువ్వు ఏదిచ్చినా ట్రిపుల్ గా తిరిగిచ్చేస్తా!
By: Tupaki Desk | 4 Jan 2023 2:19 PM GMTతమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ఎంటర్ టైనర్ `వారీసు`. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇదే మూవీని తెలుగులో `వారసుడు` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. తమిళంలో ఇదే ఆయన తొలి మూవీ. ఈ మూవీతో కోలీవుడ్ లోకి దిల్ రాజు అరంగేట్రం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబ విలువలకు అద్ధం పడుతూ ఈ మూవీని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు.
కీలక పాత్రల్లో శ్రీకాంత్, కిక్ శ్యామ్. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, సుమన్, జయసుధ నటించారు. లిరికల్ వీడియోలతో రచ్చ లేపిన ఈ మూవీ కోసం తమిళ, తెలుగు భాషల్లో విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి బరిలో జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర బృందం తాజాగా తమిళ ట్రైలర్ ని విడుదల చేసింది. ఆ వెంటనే తెలుగు వెర్షన్ `వారసుడు` ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం విశేషం.
`ఇళ్లనేది ఇటుక ఇసుకేరా వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదుగా` అంటూ తల్లి పాత్రలో జయసుధ చెబుతున్న డైలాగ్ లతో `వారసుడు` ట్రైలర్ మొదలైంది. గ్రేట్ సర్ ఈ కాలంలో కూడా జాయింగ్ ఫ్యామిలీగా వుండటం రేర్ సర్..ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..మీరు మీ ఇద్దరు కొడుకుల్నే ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ మీ చిన్న కొడుకు గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు` అంటూ సమన్ అనడం... కలర్ ఫుల్ సాంగ్ తో విజయ్ ఇంట్రడక్షన్..
ఇన్ బిజినెస్ ఆల్ వేస్ అలర్ట్.. వేటగాడు తన కళ్లల్లో మట్టి పడినా కూడా కళ్లు తెరిచే వుంచాలి... అని శ్యామ్ అనడం.. వేట గాడికి వేటే వృత్తి వెళ్లి మీ నాన్నకు చెప్పు..ఈ సీట్లో హీటేంటో ఇక మీదట చూస్తారని విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ బెదిరించడం.. పవర్ సీట్లో వుండదు సార్...అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో వుంటది.మన పవర్ ఆ రకం..` మామా నువ్వు ఏదిచ్చినా ట్రిపుల్ గా తిరిగిచ్చేస్తా అంటూ విజయ్ చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్ లు సినిమాపై అంచానల్ని పెంచేస్తున్నాయి.
ఉమ్మడిగా వున్న ఫ్యామిలీ నేపథ్యంలో సాగే సినిమా ఇదని ట్రైలర్ తో స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ తరహా సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో చాలా వచ్చాయి. అయితే `వారసుడు` ఫలితం విజయ్ క్రేజ్ మీదే ఆధారపడి వుందని, రొటీన్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి సినిమాల రేసులో ఏ మేరకు నిలబడుతుందో అన్నది తెలియాలంటే జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.