Begin typing your search above and press return to search.
సెన్సేషనల్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
By: Tupaki Desk | 8 March 2018 8:30 AM GMTతమిళంలో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘వడ చెన్నై’ ఒకటి. ఇది ధనుష్ డ్రీమ్ ప్రాజెక్టు. ఈ సినిమా కోసం అతను ఐదేళ్లుగా సన్నాహాలు చేసుకుంటుండటం విశేషం. ఇంతకుముందు ధనుష్ తో ‘పొల్లాదవన్’.. ‘ఆడుగళం’ లాంటి క్లాసిక్స్ తీసిన వెట్రిమారన్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈ రోజే లాంచ్ అయింది. ధనుష్ ఈ సినిమాలో రౌడీ పాత్రే చేస్తున్నాడని ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. బాగా జుట్టు.. గడ్డం పెంచి కళ్లలో ఇంటెన్సిటీ చూపిస్తూ నోట్లో కత్తి పెట్టుకుని కనిపిస్తున్న ధనుష్.. జనాల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.
‘వడ చెన్నై’ అంటే ఉత్తర చెన్నై అని అర్థం. ఆ ప్రాంతం రౌడీయిజానికి పెట్టింది పేరు. అక్కడ కరడుగట్టిన రౌడీలుంటారు. వాళ్ల జీవితాల్ని లోతుగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో చేస్తున్నారు. ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు కూడా రౌడీయిజం నేపథ్యంలోనే సాగుతాయి. ఆ రెండు సినిమాలూ ధనుష్ కు నటుడిగా గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. ‘ఆడుగళం’తో అతను జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. రియల్ లైఫ్ స్టోరీలతో సినిమాలు తీయడంలో వెట్రిమారన్ సిద్ధహస్తుడు. ‘వడ చెన్నై’ కోసం చాలా ఏళ్ల నుంచి పని చేస్తున్నాడతను. ధనుష్ కూడా ఈ చిత్రానికి స్క్రిప్టు సహకారం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెండు మూడు భాగాలుగా తీయడానికి వీళ్లిద్దరూ సన్నాహాలు చేసుకున్నారు. దీనికి ధనుష్.. వెట్రిలే నిర్మాతలు కూడా కావడం విశేషం.