Begin typing your search above and press return to search.
ఎన్ జీ కే ఫస్ట్ సింగిల్: వడ్డీలోడు వచ్చెనే..
By: Tupaki Desk | 12 April 2019 12:49 PM GMTతమిళ స్టార్ హీరో సూర్య - సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'NGK'(నంద గోపాల కృష్ణ) మే 31న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఈ చిత్రం నుండి 'వడ్డీలోడు వచ్చెనే' అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు చంద్రబోస్. పాడిన వారు సత్యన్. పాట లిరిక్స్ చూస్తుంటే స్టొరీలో భాగంగా వచ్చే పాట అనిపిస్తోంది. "వడ్డీలోడు వచ్చెనే గడ్డి కోసం చూసెనే అడ్డమైన మాటలే అడ్డే లేక వాగెనే.." అంటూ హీరో గురించి వివరిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ట్యూన్ క్యాచీగానే ఉంది.. ఫన్ టోన్ లో సాగే ఈ పాట ఓ నాలుగైదు సార్లు వింటే మాత్రం కనెక్ట్ అయ్యేలా ఉంది. చాలావరకూ యువన్ సాంగ్స్ స్లో పాయిజన్ లాగా ఉంటాయి. ఈమధ్య యూట్యూబ్ దుమ్ము దులిపిన సాంగ్ 'రౌడీ బేబీ' కి యువన్ సంగీత దర్శకుడు అనే సంగతి తెలిసిందే. మరీ ఈ పాట ఆ రేంజ్ కాదు కానీ ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంది.
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్.. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ వడ్డీలోడి సంగతి ఏంటో ఒకసారి చూసేయండి.