Begin typing your search above and press return to search.

అగ్రదర్శకుడికి కమెడియన్ షాక్.. కోట్లల్లో నష్టం

By:  Tupaki Desk   |   18 Jun 2021 1:00 PM IST
అగ్రదర్శకుడికి కమెడియన్ షాక్.. కోట్లల్లో నష్టం
X
దక్షిణాదిలో అగ్ర దర్శకుడిగా ‘శంకర్’కు పేరుంది. అతడి సినిమాల్లో సామాజిక అంశాలపై చక్కటి మెసేజ్ ఇస్తుంటారు. ఇప్పటికీ అగ్రహీరోలు ఆయన చిత్రాల్లో నటించడానికి క్యూ కడుతుంటారు. అయితే శంకర్ ఎప్పుడూ వినూత్నంగా ట్రై చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ‘పులికేశి’ అనే రాజు కథను కమెడియన్ వడివేలుతో కలిసి తీశాడు. ప్రముఖ టాప్ కమెడియన్ అయిన వడివేలును హీరోగా పెట్టి తీశాడు. సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం విజయవంతం కావడంతో అదే టీంతో హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి సీక్వెల్ ను నిర్మించాలని దర్శకుడు శంకర్ భావించాడు.

అయితే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. షూటింగ్ కొంత భాగం పూర్తయిన తర్వాత కథలో మార్పులు చేశారంటూ నటుడు వడివేలు షూటింగ్ లో పాల్గొనడానికి నిరాకరించాడు. దీంతో దర్శకుడు శంకర్ కు, కమెడియన్ వడివేలుకు మధ్య విభేదాలు తలెత్తాయి. నిర్మాతల మండలిలో ఫిర్యాదుల వరకు వెళ్లింది.

వడివేలు కారణంగా తనకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని దర్శకుడు శంకర్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వడివేలు నటనకు దూరమయ్యారు. పలుమార్లు నిర్మాతలు వీరిద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.

తాజాగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత బసరి గణేషఊ్ వీరిద్దరితో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. దర్శకుడు శంకర్ కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు సమ్మతించాడు. దీంతో త్వరలోనే పులికేసి చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.