Begin typing your search above and press return to search.

ప్రియ వారియర్ ఫాలోయింగ్ ఏ రేంజికి చేరిందంటే..

By:  Tupaki Desk   |   24 March 2018 11:29 AM GMT
ప్రియ వారియర్ ఫాలోయింగ్ ఏ రేంజికి చేరిందంటే..
X
30 సెకన్లు.. కేవలం 30 సెకన్ల వీడియోతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించింది మలయాళ టీనేజర్ ప్రియ ప్రకాష్ వారియర్. ఆమె కన్ను కొట్టే వీడియో సౌత్ నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా పాపులరైంది. దేశం అవతల కూడా ఈ వీడియోకు పాపులారిటీ వచ్చింది. ఆమె ప్రభావం యువతపై ఏ స్థాయిలో ఉందంటే.. ఒక కాలేజీలో అమ్మాయిలందరూ ప్రియలాగా కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేస్తుండటంతో అలా చేస్తే ఏడాది పాటు కాలేజీ నుంచి డిబార్ చేస్తామనే పరిస్థితి వచ్చింది. మరో వైపు ఆమె పాపులారిటీని మంచి పనులకూ ఉపయోగించుకునే వాళ్లూ తక్కువేమీ కాదు.

గుజరాత్‌ లోని వడోదరలో పోలీసులు ఒక మంచి ప్రచారం కోసం ప్రియ ఫొటోను వాడుకుంటుండటం విశేషం. ప్రియ కన్ను కొడుతున్న చిత్రాన్ని ముద్రించి ట్రాఫిక్ అవేర్ నెస్ మీద ప్రకటనలు రూపొందించారు అక్కడి పోలీసులు. రెప్పపాటులో ప్రమాదాలు చోటు చేసుకుంటాయని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాంటూ పక్కనే ప్రియ కన్ను కొడుతున్న చిత్రం పెట్టారు. ఇలా పలు వినూత్నమైన ప్రకటనలు రూపొందించారు. ఈ సృజనాత్మకత వెనుక ఒక యాడ్ ఏజెన్సీ ఉందట. మామూలుగా నీతులు చెబితే జనాలకు ఏం పడుతుంది. ఇలా ప్రియ వారియర్ ఫొటో కనిపించి.. దాని పక్కన మంచి విషయం చెబితే కచ్చితంగా అది జనాల్ని ఆకర్షిస్తుంది. వడోదర పోలీసులు ఈ విషయంలో మంచి ఎత్తుగడే వేశారని చెప్పాలి.