Begin typing your search above and press return to search.
బుడ్డ తేజూ సీనియర్ లను చూసి నేర్చుకోబ్బా..!
By: Tupaki Desk | 30 Sep 2021 12:30 AM GMTచిరంజీవి.. బాలకృష్ణ ఇంకా ఇతర సీనియర్ లు 1980 మరియు 90 ల్లో ఒక్కో ఏడాదికి అయిదు నుండి పది అంతకు మించిన సినిమాలను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాని సినిమా బడ్జెట్ పెరగడం తో పాటు ఇతర కారణాల వల్ల సినిమాల సంఖ్య ను హీరోలు తగ్గించారు. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి చాలా సినిమాలు చేసేవారు. కాని ఇప్పుడు యంగ్ స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఈమద్య కాలంలో హీరోల ఆలోచన తీరు మారింది. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు కాని ఒకటి రెండు ఏళ్ల ముందు వరకు ఒక సమయంలో ఒకే సినిమాను చేస్తూ ఏడాదికి ఒకటి అర సినిమాలను మాత్రమే విడుదల చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు స్టార్ హీరోలు కూడా ఏడాదిలో కనీసం రెండు సినిమాలు అయినా విడుదల చేయాలనే పట్టుదలకు వచ్చారు. ఇక ఇతర యంగ్ హీరోలు మాత్రం సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు.
నాని.. సాయి ధరమ్ తేజ్.. శర్వా.. నితిన్.. నాగచైతన్య వంటి యంగ్ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున ప్లాన్ చేస్తున్నారు. కరోనా కారణంగా చాలా గ్యాప్ వచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాదిలో రెండు మూడు సినిమాలను విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన సినిమా తో అరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్ బాబు మాత్రం మెల్లగా సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉప్పెన సినిమా విడుదలకు ముందే కొండ పొలం సినిమాను ముగించిన వైష్ణవ్ తేజ్ వావ్ చాలా స్పీడ్ గా సినిమాలు చేసేలా ఉన్నాడే అని అంతా భావించారు. కాని అతడు మూడవ సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవలే గిరీశయ్య దర్శకత్వంలో ఆ సినిమా ప్రకటన వచ్చింది. ఇక నాల్గవ సినిమా ప్రకటన మాత్రం ఎప్పుడు అనేది తెలియడం లేదు. గిరీశయ్య దర్శకత్వంలో చేస్తున్న సినిమా ముగించే వరకు నాల్గవ సినిమాను తేజూ ప్రకటించడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయాల్సిన యంగ్ హీరో ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఉండటం బాగా లేదని కొందరు మెగా అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పెన సినిమా తో వైష్ణవ్ తేజ్ స్టార్ అయిన విషయం అందరికి తెల్సిందే. ఆ స్టార్ డమ్ ను ఉపయోగించుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మరిన్ని సక్సెస్ లు దక్కించుకుంటే కెరీర్ లో దూసుకు పోవచ్చు. కాని వైష్ణవ్ తేజ్ మాత్రం కొత్త వారితో మళ్లీ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన వారు ఎవరైనా వచ్చి కథ చెప్తారా అంటూ ఎదురు చూస్తున్నాడు. కాని సీనియర్ స్టార్ డైరెక్టర్స్ అంతా కూడా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కనుక తన తోటి యంగ్ హీరోలు కొత్త పాత అనే తేడా లేకుండా మంచి కథలు ఎంపిక చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తుండటం చూసి నేర్చుకోవాలంటూ వైష్ణవ్ తేజ్ కు నెటిజన్స్ సూచిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ల కోసం చూస్తే ఏడాదికి కనీసం ఒక్క సినిమాను కూడా చేసే అవకాశం ఉండదని.. అందుకే వరుసగా సినిమాలు చేసేందుకు కొత్త వారిని ఎంపిక చేసుకోవాలని అభిమానులు సైతం సూచిస్తున్నారు.