Begin typing your search above and press return to search.

వైష్ణవ్‌ ఆలోచనలే వేరు.. పవన్ వల్లే ఇలా!

By:  Tupaki Desk   |   4 Oct 2021 4:30 AM GMT
వైష్ణవ్‌ ఆలోచనలే వేరు.. పవన్ వల్లే ఇలా!
X
మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఏ మెగా హీరోకు దక్కని గ్రాండ్ ఎంట్రీ వైష్ణవ్‌ కు దక్కింది. వంద కోట్ల సినిమాతో కెరీర్‌ ను ఆరంభించిన హీరోగా టాలీవుడ్‌ లో ప్రత్యేక స్థానంలో నిలిచాడు అనడంలో సందేహం లేదు. వైష్ణవ్‌ తేజ్ రెండవ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. భారీ బ్లాక్ బస్టర్‌ ఉప్పెన తర్వాత వైష్ణవ్ నుండి రాబోతున్న మూవీ కొండ పొలం. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కొండ పొలం ఈ వారంలో విడుదల కాబోతుంది. సినిమా చిత్రీకరణ చాలా తక్కువ సమయంలోనే పూర్తి అయ్యింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఈ సందర్బంగా హీరో వైష్ణవ్ తేజ్ వరుసగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్బంగా అన్నయ్య ఆరోగ్యం మరియు ఇతర విషయాల గురించి మాట్లాడాడు.

తాజా ఇంటర్వ్యూలో తన సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడటం జరిగింది. వైష్ణవ్ కు మొదటి నుండి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది కాదట. చాలా కథలు రాసుకుని.. ఎన్నో ఐడియాలతో ఫిల్మ్ మేకింగ్‌ పై ఆసక్తిగా ఉన్నాడట. అలాంటి వైష్ణవ్‌ తేజ్ కు పవన్ కళ్యాణ్‌ ఒకానొక సమయంలో చేసే పనిపై ఫోకస్ పెరగాలంటే మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకోమని సలహా ఇచ్చాడట. అన్ని విషయాల్లో అవగాహణ పెంచుకోవడంతో పాటు అన్ని విధాలుగా కూడా మార్షల్ ఆర్ట్స్‌ మంచిది అనే ఉద్దేశ్యంతో పవన్ ఈ సలహానే మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు ఇవ్వడం జరిగింది. వైష్ణవ్ తేజ్ మామ సలహా మేరకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకునేందుకు సిద్దం అయ్యాడు. ఆ సమయంలో వైష్ణవ్‌ తేజ్ యొక్క లుక్ మరియు మార్షల్ ఆర్ట్స్ లో అతడు కనబర్చుతున్న ప్రతిభ చూసి పవన్‌ కు ముచ్చటేసిందట. దాంతో నువ్వు నటుడివి అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడట.

పవన్ సహజంగా కుటుంబ సభ్యుల్లో ఎవరిని కూడా నటుడిగా ప్రోత్సహించలేదు అనేది టాక్‌. ఇంట్రెస్ట్‌ ఉంటే రావాలి కాని వారసత్వం ఉందని రాకూడదు అనేది పవన్ అభిప్రాయం. కాని వైష్ణవ్‌ తేజ్ ను మాత్రం నువ్వు నటుడిగా రాణిస్తావు ఆ దిశగా ప్రయత్నాలు చేయి అంటూ సూచించాడట. దాంతో వైష్ణవ్‌ కు హీరో అవ్వాలనే ఆసక్తి మొదలు అయ్యిందట. హీరో అవ్వడం కోసం యాక్టింగ్‌ లో శిక్షణ తీసుకోవడంతో పాటు డాన్స్ మరియు ఇతర విషయాలపై కూడా అవగాహణ పెంచుకున్నట్లుగా వైష్ణవ్ తెలియజేశాడు. మొత్తానికి వైష్ణవ్ ఆలోచనలో డైరెక్షన్‌ ఉంటే పవన్‌ సూచనతో హీరో అయ్యాడు. పవన్ సలహా మరియు విజన్ ఎంత పవర్ ఫుల్‌ అనేది ఉప్పెన సినిమాతో తేలిపోయింది. ఉప్పెన సినిమా ఘన విజయం సాధించడం వల్ల వైష్ణవ్ మొదటి సినిమాతోనే స్టార్‌ అయ్యాడు. అల్లుడికి మద్దతు విషయంలో పవన్‌ ఇప్పటికి తనవంతు అన్నట్లుగా చేస్తూ ఉంటాడు.