Begin typing your search above and press return to search.
రంగ రంగా ఈసారి హిట్టు కొట్టాలి రంగా!
By: Tupaki Desk | 30 March 2022 5:30 PM GMTఆరంగేట్రమే ఉప్పెన చిత్రంతో బాక్సాఫీస్ ఉప్పెనకు కారకుడయ్యాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ హీరోగా రికార్డు అందుకున్నాడు. సంచలనాల డెబ్యూ హీరోగా అతడి పేరు మార్మోగింది. కానీ ఇంతలోనే తన రెండో సినిమా కొండపొలం డాక్యు సినిమా తరహాలో సాగడంతో అభిమానులు రిటర్న్ గిఫ్టిచ్చారు.
ఆ సినిమాపై పెదవి విరుపులు తప్పలేదు. ఇక తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `రంగ రంగ వైభవంగా` జూలై 1న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఈరోజు ప్రకటించారు. కీలకమైన ప్రకటనను గుర్తుచేసే రంగురంగుల పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ స్టెతస్కోప్ తో కనిపించాడు. పక్కనే హీరోయిన్ విచిత్రమైన భంగిమ ఆహార్యంతో కనిపించింది.
అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ కి దర్శకత్వం వహించిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాపినీడు సమర్పణలో అత్తారింటికి దారేది నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ తర్వాత కేతికకు ఇది అరుదైన అవకాశం. అలాగే షామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మెగా హీరో తృతీయ ప్రయత్నం బంపర్ హిట్ కొడతాడేమో చూడాలి. అతడికి జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ లైనప్ వెయిటింగ్ లో ఉంది. మెగా మావయ్యల ఆశీస్సులు అతడికి ఎప్పుడూ ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ తరహాలోనే విభిన్నమైన కథాంశాలతో అతడు ప్రయోగాలు చేస్తాడనే భావిస్తున్నారు. ఇక కంటెంట్ పరంగా ప్రయోగాలు చేసినా కానీ కమర్షియల్ హంగులు లేనిదే వర్కవుట్ కాదు. రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ వైష్ణవ్ తేజ్ ముందుకు అభిమానులు ఆశిస్తున్నారు.