Begin typing your search above and press return to search.

మాస్ ఇమేజ్ కోసం మెగా హీరో రిస్క్..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 4:27 AM GMT
మాస్ ఇమేజ్ కోసం మెగా హీరో రిస్క్..!
X
హీరోగా ఎన్ని లవ్ స్టోరీస్ చేసినా మాస్ ఆడియన్స్ కు దగ్గరైతే కానీ స్టార్ ఇమేజ్ రాదు. ఇది అందరికి తెలిసిన ఫార్ములానే అందుకే ప్రతి హీరో ఒకటి రెండు సినిమాలు చేయగానే సీరియస్ సబ్జెక్ట్స్, మాస్ కథల మీద మోజు పెంచుకుంటారు. ప్రస్తుతం ఈ లిస్ట్ లో తాను కూడా చేరాలని అనుకుంటున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.

ఉప్పెనతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకున్న అతను ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు నిరాశ పరచాయి. కొండపొలం క్రిష్ డైరెక్షన్ కాబట్టే చేశాడు. రంగ రంగ వైభవంగా మాత్రం రొటీన్ సబ్జెక్ట్ తో రావడంతో ఆడియన్స్ లైట్ తీసుకున్నారు.

వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమా శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా టర్న్ తీసుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్. అయితే మాస్ హీరోగా ఆడియన్స్ ని మెప్పించడం అంటే అంత ఈజీ విషయం కాదు.

మొదటి మూడు సినిమాలు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో అలరించిన వైష్ణవ్ తేజ్ సడెన్ గా మాస్ హీరోగా సీరియస్ కథలతో వస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఓ విధంగా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో రిస్క్ చేస్తున్నాడని చెప్పొచ్చు.

హీరో అన్న తర్వాత అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుంది. అన్ని జానర్ లను టచ్ చేయాల్సి ఉంటుంది. వైష్ణవ్ తేజ్ కూడా అందుకే కెరీర్ ఎర్లీ స్టేజ్ లోనే ఓ డిఫరెంట్ కథతో సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకోగలిగితే హీరోగా వైష్ణవ్ తేజ్ నిలబడినట్టే. కథ ఎలాంటిదైనా ఆడియన్స్ ని కన్విన్స్ చేసి మెప్పించగలిగితే హీరోగా సక్సెస్ అయినట్టే లెక్క.

వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాలో శ్రీ లీలతో రొమాన్స్ చేస్తున్నాడు. ధమాకాతో సూపర్ ఫాం లో ఉన్న శ్రీ లీల కూడా వైష్ణవ్ తేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. వైష్ణవ్ తేజ్ ఫోర్త్ మూవీ సితార ఎంటర్టైన్ మెంట్స్, త్రివిక్రమ్ కలిసి నిర్మిస్తుండటం తప్పకుండా సినిమాలో విషయం ఉండే ఉంటుందని అంటున్నారు. త్రివిక్రమ్ హ్యాండ్ పడింది అంటే అక్కడ ఏదో ఒక మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుంది. సో వైష్ణవ్ తేజ్ మూవీ మెగా ఫ్యాన్స్ నే కాదు సినీ లవర్స్ ని అలరిస్తుందని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.