Begin typing your search above and press return to search.
మెగా 'మనం' కు మెగాస్టోరీ సిద్దం
By: Tupaki Desk | 8 Oct 2021 4:30 AM GMTఅక్కినేని ఫ్యామిలీ మూడు తరాల వారు కలిసి నటించిన 'మనం' సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. మనం సినిమా అక్కినేని వారికి ఎంత స్పెషల్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగేశ్వరరావు.. నాగార్జున.. చైతూ ఇంకా అఖిల్ లు నటించిన ఆ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. నాచురాలిటీకి చాలా దూరంగా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే మాయాజాలంతో ఆకట్టుకునే విధంగా చేశారు. అలాంటి విభిన్నమైన కథ మరియు ట్యాలెంటెడ్ డైరెక్టర్ దొరికితే ఇంకా పలు ఫ్యామిలీలు కూడా మనం వంటి మల్టీ స్టారర్ చేయాలని ఆశ పడుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ చాలా మంది మెగా మనం కావాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు. చాలా మంది మెగా హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీ కోసం ఎవరైనా ఒక మంచి మనం కథను రెడీ చేయక పోతారా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ కథ రెడీ అయ్యిందని దర్శకుడు క్రిష్ ద్వారా సమాచారం అందుతోంది. క్రిష్ ఈ విషయాన్ని చెప్పాడు కాని కథను రెడీ చేసింది మాత్రం ఆయన కాదు. ఆయన దర్శకత్వంలో రూపొందిన కొండపొలం హీరో వైష్ణవ్ తేజ్ ఆ కథను రాసుకున్నాడట. కథ ను కొండ పొలం షూటింగ్ సమయంలో చెప్పాడంటూ క్రిష్ తెలియజేశాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. నాకు హీరో అవ్వాలనే ఆసక్తి ఉండేది కాదు. దర్శకుడిగా సినిమాలు చేయాలని చాలా కథలు రాసుకున్నాను. ఆ సమయంలో కళ్యాణ్ మామయ్య మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆయన సలహాతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటే హీరో అవ్వమని సలహా ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. హీరో అయినా కూడా తనలోని దర్శకుడిని వైష్ణవ్ అలాగే ఉంచాడట. ఇప్పుడు కాకున్నా ఎప్పటికి అయినా ఖచ్చితంగా వైష్ణవ్ తేజ్ దర్శకత్వం చేస్తాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. మనం సినిమా అక్కినేని వారికి ఒక మంచి జ్ఞాపకంగా ఎలా అయితే నిలిచిందో అలాంటిదే మెగా ఫ్యామిలీకి ఉండాలనే ఉద్దేశ్యంతో వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ కోసం కథను రాశాడట. మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు హీరోలు అందులో కనిపించేలా పాత్రలు రాసుకున్నాడట.
కొండ పొలం విడుదల సందర్బంగా దర్శకుడు క్రిష్ వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. దర్శకుడి నుండి లైట్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసే ఏకైక వ్యక్తి వైష్ణవ్ తేజ్. పెద్ద వాళ్లను చిన్న వాళ్లను ఒకే తరహా మర్యాదతో పలకరిస్తాడు.. గౌరవిస్తాడు. ఎప్పుడూ కూడా చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను అతడి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. తేజ్ కు కథలు రాయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అతడు చాలా కథలు రాసినట్లుగా నాతో చెప్పాడు. ముఖ్యంగా నాతో మెగా ఫ్యామిలీ కోసం తాను రాసుకున్న కథను చర్చించేవాడు. ఆ కథ కూడా చాలా బాగా వచ్చింది. ఆ కథకు ఒక మంచి టైటిల్ ను కూడా అనుకున్నాడు.
తేజ్ కు దర్శకత్వం పై చాలా ఆసక్తి ఉంది. కాని అతడు మాత్రం హీరోగా స్టార్ డం దక్కించుకోవాలని నాకు చూడాలని ఉంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో గొర్రెల కాపరి పాత్రను చేసేందుకు ఒప్పుకోవడం నిజంగా అభినందనీయం. ఆ పాత్రకు నూటికి నూరు శాతం వైష్ణవ్ తేజ్ న్యాయం చేశాడు. కొండ పొలం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమా తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుందని మెగా అభిమానులు మొదటి నుండి నమ్మకంతో ఉన్నారు. వైష్ణవ్ కు ఉప్పెనతో మొదటి సక్సెస్ దక్కింది.. మరి కొండ పొలం రెండవ సక్సెస్ ను తెచ్చి పెట్టిందా అనేది చూడాలి.