Begin typing your search above and press return to search.

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అప్టేట్ చెప్పిన వైష్ణవ్ తేజ్

By:  Tupaki Desk   |   3 Oct 2021 4:30 AM GMT
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అప్టేట్ చెప్పిన వైష్ణవ్ తేజ్
X
తన తొలి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పుడు తన రెండో సినిమా 'కొండపోలం'ని చురుకుగా ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. సినిమా పూర్తి చేసి ప్రమోషన్ వేటలో పడ్డాడు.

ఈ సందర్భంగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన విశేషాలను వెల్లడిస్తున్నాడు. ఓ మీడియా పోర్టల్‌తో ఇటీవల జరిగిన ఇంటరాక్షన్‌లో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైష్ణవ్‌ వివరించాడు. దీనికి 'సాయి' బాగానే ఉన్నాడని వైష్ణవ్ సమాధానమిచ్చాడు.

'సాయి బాగా కోలుకుంటున్నాడు. కానీ అతను ఇప్పటికీ వైద్య పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఉన్నాడు. అతను ఫిజికల్ థెరపీ చేయించుకుంటున్నాడు. ఒక వారం తర్వాత ఇంటికి తిరిగి రావచ్చు” అని వైష్ణవ్ తేజ్ చెప్పాడు.

సెప్టెంబర్ 10న సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైన ఆస్పత్రి పాలైన సంగతి విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నడుపుతూ సాయిధరమ్ స్కిడ్ అయ్యి కిందపడ్డాడు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి భుజానికి శస్త్రచికిత్స కూడా చేశారు. సాయిధరమ్ కు చేసిన 'కాలర్ బోన్ సర్జరీ' కూడా సక్సెస్ అయ్యింది. అయితే ఇంకొన్ని రోజులు సాయిధరమ్ తేజ్ వెంటిలేటర్ మీదే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పేశారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో మెగా ఫ్యామిలీ తీసుకుంటున్న జాగ్రత్తలు అందరికీ తెలిసిందే..