Begin typing your search above and press return to search.

వైష్ణవ్ చాలా స్వీట్: ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ఎక్స్ క్లూసీవ్ ఇంటర్వ్యూ

By:  Tupaki Desk   |   9 Feb 2021 11:50 AM GMT
వైష్ణవ్ చాలా స్వీట్: ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ఎక్స్ క్లూసీవ్ ఇంటర్వ్యూ
X
మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో పాటు “ఉప్పెన” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది హీరోయిన్ కృతిశెట్టి. ఫస్ట్ సినిమా విడుదలకు ముందే విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకుంది. తన కళ్లతో, నవ్వుతో తెలుగు కుర్రకారును అల్లాడిస్తున్న ఉప్పెనతో టాలీవుడ్ లో ఉప్పెన సృష్టిస్తానంటుంది. తుపాకీతో లేటెస్ట్ ఎక్స్ క్లూసీవ్ ఇంటర్వ్యూలో కృతి చెప్పిన విషయాలేంటో చూద్దాం!

గూగుల్ లో అద్వైత అని ఉంది. అది మీరేనా?
అది నా పేరు కాదు. నిజానికి కృతిశెట్టి అనే పేరుతో వేరే అమ్మాయి ఉంది. ఆమె తన పేరును అద్వైతగా మార్చుకుంది. వికీపీడియాలో అలా లింక్ అయ్యిపోయింది. కానీ నా పేరు కాదు.

అసలు మీ బ్యాగ్రౌండ్ ఏంటి? ఉప్పెన ఆఫర్ ఎలా వచ్చింది?
నాకు చిన్నప్పటి నుండే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది కానీ అదే కెరీర్ అవుతుందని అనుకోలేదు. నిజానికి నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ ఈ ఆఫర్ వచ్చాక స్టోరీ విన్నాను. స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పాను.

మీతో పాటు హీరోకి కూడా ఫస్ట్ మూవీ కదా.. ఎప్పుడైనా ఈ విషయం డిస్కస్ చేసారా?
లేదు. వైష్ణవ్ ఇంటర్వ్యూలలో చెప్పేవరకు నాకు తెలియదు. సెట్ లో ఎప్పుడు మాట్లాడుకోలేదు.

ఫస్ట్ సినిమాకే తెలుగు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎలా నేర్చుకున్నారు?
తెలుగు విషయంలో డైరెక్టర్ బుచ్చి చాలా హెల్ప్ చేశారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ వివేక్, రాహుల్ అని మరొకరు చాలా హెల్ప్ చేశారు. వారితో పాటు హీరో కూడా నాకు నేర్పించారు.

మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ?
మాది మంగళూరు. నిజానికి నేను పుట్టింది మంగళూరులోనే కానీ పెరిగింది అంతా ముంబైలో.

ఉప్పెన షూటింగ్ సమయంలో బెస్ట్ మెమోరీ ఏంటి?
బెస్ట్ మెమోరీ అంటే.. షూటింగ్ లో ఓ ఎమోషనల్ సీన్ చేసాక డిఓపి గారు ఏడ్చేసారు. అలాగే మానిటర్ వెనుక వారంతా ఏడ్చేశారు. అప్పుడే నాకు ప్రౌడ్ గా అనిపించింది.

విజయ్ సేతుపతి గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
విజయ్ సేతుపతి గారు సెట్స్ లో చాలా క్యూట్ గా ఉంటారు. కానీ యాక్షన్ చెప్పగానే టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇస్తారు. మా ఇద్దరి మధ్య కూడా సీన్స్ ఉన్నాయి. మధ్యమధ్యలో సేతుపతి గారు కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు. ఆ సీన్ చాలా బాగుంటుంది.

ఈ సినిమా ఓకే చేసే టైంలో వైష్ణవ్ బ్యాక్గ్రౌండ్ తెలుసా?
నాకు చిరంజీవి గారు తెలుసు. కానీ డైరెక్టర్స్, యాక్టర్స్ తెలియదు. కానీ సుకుమార్ గారు ఫస్ట్ కలిసినప్పుడే ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు.

వైష్ణవ్ తో వర్కింగ్ అనుభవం ఎలా ఉంది?
వైష్ణవ్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. నాకు చాలా హెల్ప్ గా ఉండేవాడు. తనొక బ్రిలియెంట్ యాక్టర్ అది సినిమాలో చూస్తారు. నేను వైష్ణవ్ నుండి చాలా నేర్చుకున్నాను.

ఇంతకుముందు సినిమాలలో యాక్టింగ్ చేయలేదు కదా.. మరి ఎలా హ్యాండిల్ చేశారు?
నేను యాక్టింగ్ నేర్చుకోలేదు. కానీ యాడ్స్ చేసిన అనుభవం ఉంది. షూట్ కి ముందు కొన్ని సెషన్స్ చేసాం. కానీ అవి కూడా తెలుగు నేర్చుకోవడానికే. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ బాగా మోటివేట్ చేశారు.

మీకు నచ్చిన సాంగ్ ఏంటి?
నీ కన్ను నీలి సముద్రం.. నాకు బాగా నచ్చింది. ఆ సాంగ్ డిఎస్పీ గారు చాలా బాగా కంపోజ్ చేశారు. ఈ సినిమాను ఆ సాంగ్ వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది.

ముంబైకి ఇక్కడికి డిఫరెంట్ ఎలా అనిపించింది?
నిజానికి ఇక్కడికి రాగానే చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చాలాబాగా చూసుకున్నారు. కానీ ముంబైలో యాడ్స్ షూట్ చేసేటప్పుడు ఇలా ఉండదు. ఇక్కడ రెస్పెక్ట్ చూసి ఆశ్చర్యపోయాను.

ఫస్ట్ సినిమా రిలీజ్ కు ముందే మల్టీపుల్ ప్రాజెక్ట్స్ సైన్ చేశారు. ఇది చాలా రేర్ గా జరుగుతుంది?
అవును. ఉప్పెన రిలీజ్ తర్వాత నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు చూద్దాం అనుకున్నా. కానీ మంచి ఆఫర్స్ వచ్చాయి ఓకే చేసాను. నానితో శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తున్నా.

మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు.. ఏంటి?
సినిమా చూసిన తర్వాత సుకుమార్ గారు కొరటాల శివ గారు మా ప్రొడ్యూసర్ నవీన్ గారు అయితే ఫోన్ చేసి నా పెర్ఫామెన్స్ గురించి షివర్ అవుతూ చెప్పారు. కానీ మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నా పెర్ఫామెన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడ్డం ఓ మై గాడ్ అనిపించింది. అంత గొప్ప యాక్టర్ నా కోసం మాట్లాడటం నాకు చాలా గర్వంగా అనిపించింది.

మీ మామ్ డాడ్ ఏం చేస్తారు?
మా డాడ్ బిజినెస్ చేస్తారు. మామ్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్.

ఓకే కృతిగారు థాంక్యూ. మా తుపాకీ తరపున ఆల్ ది బెస్ట్.