Begin typing your search above and press return to search.

దేశం కోసం ప్రాణం ఇచ్చేద్దాం అనుకున్నా: వైష్ణవ్ తేజ్

By:  Tupaki Desk   |   1 Sep 2022 3:56 AM GMT
దేశం కోసం ప్రాణం ఇచ్చేద్దాం అనుకున్నా: వైష్ణవ్ తేజ్
X
'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రంతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. హీరోగా డెబ్యూ మూవీ 'ఉప్పెన' తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'రంగ రంగ వైభవంగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'కొండపొలం' పరాజయం తర్వాత రాబోతున్న ఈ చిత్రంతో కచ్చితంగా హిట్ కొడతాననే ధీమాగా ఉన్నాడు.

వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా 'రంగ రంగ వైభవంగా' సినిమా తెరకెక్కింది. గిరీశయ్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రేపు సెప్టెంబర్ 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ తన సినిమాని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా వైష్ణవ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను హీరోని కావాలని ఎప్పుడూ కోరుకోలేదని.. యాక్సిడెంటల్ గానే నటుడిని అయ్యానని చెప్పాడు. దీని వెనుక తన మేనమామ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వెల్లడించారు.

'హీరో కావాలనే ఆలోచన ఎలా వచ్చింది?' అని అడగ్గా.. ''హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి కెమెరా వెనుక ఉండాలని అనుకున్నా. ఫైట్స్ - డైరెక్షన్స్.. ఇలాంటి వారిపై ఇంట్రెస్ట్ ఉండేది. డైరెక్షన్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్న టైంలో కళ్యాణ్ గారు వచ్చి.. 'మంచి యాక్టర్ గా తయారవ్వు.. హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చెయ్' అని చెప్పారు. ఆ ఐడియా నాకు నచ్చింది. ట్రై చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకున్నాను'' అని వైష్ణవ్ తెలిపారు.

''అప్పట్లో ఏం చేయాలో తెలియదు. బైపీసీ చేసిన తర్వాత నిహారిక మాస్ కమ్యూనికేషన్ చేసిందని నేనూ చేశా. డైరెక్షన్ కోర్సు చేద్దాం అనుకున్నా. కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. దానికి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. ఇంట్లో అడగలేను. ఆ కోర్సు జాయిన్ అవడంలోనూ కన్ఫ్యూజన్ ఉండేది''

''డిగ్రీ థర్డ్ ఇయర్ లో అందరికీ జాబ్స్ వచ్చేశాయి. నాకు మాత్రం ఏంటి లైఫ్? ఏం చేయాలి? అనేది తెలిసేది కాదు. ఏం చేయాలో క్లారిటీ లేక రెండేళ్లు వేచి చూద్దాం అనుకున్నా. ఆ సమయంలో జిమ్ కు వెళ్లేవాడిని.. కిక్ బాక్సింగ్ నేర్చుకునేవాడిని. కళ్యాణ్ గారు చెబితే థాయిలాండ్ వెళ్లి రెండు నెలలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా''

''కోర్సు చేసి కిక్ బాక్సింగ్ ట్రెయినర్ అవుదామని అనుకున్నా. ఆ తర్వాత జ్యూయలరీ డిజైనర్ అవుతామనుకున్నా. యానిమేషన్ మీద డిగ్రీ చేసి 3డీ యానిమేటర్ ఔదామనుకున్నా. ఇలా రకరకాలుగా ఆలోచించేవాడిని. కానీ ఏదీ స్యూర్ కాదు. ఇది చేయాలని గట్టిగా ఎప్పుడూ అనుకోలేదు''

''ఇలా ఉన్న రోజుల్లో చాలా ఫీల్ అయిపోయాను. జీవితానికి ఏదొక పర్పస్ ఉండాలి కదా అనుకున్నాను. నా దగ్గర ప్రాణం తప్ప ఇంకేం లేదు. దాన్ని దేశానికి ఇచ్చేద్దామనుకున్నా. ఒక రోజు ఇదే అమ్మతో చెప్పా. 'ఆర్మీ లైఫ్ అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. చాలా ధైర్యంగా ఉండాలి' అని అమ్మ చెప్పింది''

''అసలు నేనేం అవ్వాలి అని ఆ మూడు నాలుగేళ్లు చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడే ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. ఈ క్రమంలో నా బాడీ కూడా టోన్ అవుతూ వచ్చింది. అప్పుడు కొందరు దర్శకులు నన్ను చూసి సినిమా ఆఫర్ చేశారు. 'ఉప్పెన' కంటే ముందే రెండు మూడు ఆఫర్స్ వచ్చాయి. అలా ఇదంతా స్టార్ట్ అయింది'' అని పంజా వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.