Begin typing your search above and press return to search.
కామెడీ మసాలా - ట్రైలర్ టాక్
By: Tupaki Desk | 3 Jun 2019 12:07 PM GMTఆ మధ్య సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో పాటు అదే పేరుతో ఎల్ఎల్బి అనే మరో సినిమా చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సప్తగిరి కొత్త సినిమా వజ్రకవచధారి గోవిందా. ఈ నెల 14న విడుదల కాబోతున్న సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కొంత క్లిష్టంగా అనిపించినా కథ చెప్పే ప్రయత్నం ఇందులో గట్టిగానే చేశారు.అనగనగా ఒక ఊరు. అక్కడో పురాతన గుడి. అందులో చాలా నిధులు నిక్షేపాలు ఉంటాయి. కానీ ఎవరూ లోపలికి వెళ్ళకూడదు అని కట్టుబాటు ఉంటుంది.
దాంతో తన జీవితంలో ఓ ముఖ్యమైన అవసరం కోసం అక్కడ స్వామిజి అవతారంలో అడుగుపెడతాడు హీరో(సప్తగిరి). తన మాయలతో చేష్టలతో జనాన్ని నమ్మిస్తాడు. ఓ అమ్మాయి(వైభవి జోషి)ప్రేమిస్తాడు. కట్ చేస్తే హీరోకి విలువైన రాళ్ళూ వజ్రాలు దొరుకుతాయి. ఇది తెలుసుకున్న ఊరి పెద్దగా చెలామణి అయ్యే ఫ్యాక్షనిస్టు ప్రమాదాలు సృష్టిస్తాడు. అసలు సప్తగిరి అంత రిస్క్ చేసి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేదే అసలు పాయింట్
ట్రైలర్ బట్టి చూస్తే ఇందులో కామెడీతో పాటు అన్ని రకాల మాసాలాలు జొప్పించినట్టు కనిపిస్తోంది. హాస్యానికి పెద్ద పీట వేసినా మాస్ కి కావాల్సిన అంశాలు మిస్ కాకుండా జాగ్రత్త పడ్డారు దర్శకుడు అరుణ్ పవార్. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బుల్గానిన్ సంగీతం బాగానే ఎలివేట్ అయ్యాయి. ప్రవీణ్ వనమాలీ ఛాయాగ్రహణం రిచ్ లుక్ వచ్చేలా సహాయపడింది.
సప్తగిరి తన టైమింగ్ తో చెలరేగగా హీరొయిన్ వైభవి పర్వాలేదు అనిపించేలా ఉంది. సీనియర్ హీరొయిన్ అర్చన మరో కీలక పాత్రలో కనిపించడం విశేషం. సప్తగిరి వేసిన బాబాల వేషాలు ముత్తులో రజినీకాంత్ గెటప్ లో పేల్చిన డైలాగ్ అన్ని బాగానే కుదిరాయి. కొంత సస్పెన్స్ కొంత కామెడీ కొంత యాక్షన్ అన్ని మిక్స్ చేసిన ఈ వజ్రకవచధారి గోవింద ఈ నెల 14న ధియేటర్లలో అడుగు పెట్టనున్నాడు.