Begin typing your search above and press return to search.
ఫ్రెండ్సే కదా.. కూర్చొని మాట్లాడుకోవచ్చుగా..?
By: Tupaki Desk | 22 March 2017 1:46 PM GMTసినిమా ఇండస్ట్రీలోనే కాదు.. మ్యూజిక్ లవ్వర్స్.. సినీ అభిమానుల మధ్య బాలు.. ఇళయరాజాల వివాదంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ ఒకటి సాగుతోంది. తన పాటల్ని పాడినందుకు రాయల్టీ చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వటం.. దీనిపై బాలు స్పందిస్తూ ఇకపై తాను ఇళయరాజా పాటల్ని పాడనని చెప్పటం తెలిసిందే. ఇళయరాజా పాటల్నిపాడిన బాలుకు నోటీసులు ఇవ్వటం ఏమిటంటూ పలువురు విస్మయానికి గురి అయితే.. పలువురు సినీ ప్రముఖులు రెండు వర్గాలుగా విడిపోయి..ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
బాలు వాదనను సమర్థించే వారు కొందరైతే.. ఇళయరాజా వాదనను సమర్థించేవారు మరికొందరు.ఇలాంటి వేళ.. ప్రముఖ సినీసమీక్షకులు.. సినిమావిశ్లేషకుడు అయిన వీఏకే రంగారావు ఆసక్తికర వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన తన అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. బాలు.. ఇళయరాజా ఇద్దరూ మంచి మంచి స్నేహితులే అని.. ఈ వ్యవహారం మీద ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదన్నారు. కానీ.. నోటీసుల వరకూ విషయం ఎందుకు వచ్చిందన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు.
1969లో ది ఇండియన్ ఫెర్ ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ ఏర్పడిందని..దాని నిబంధనల ప్రకారం టికెట్ వసూలు చేసే కార్యక్రమాల్లో ఎవరి పాటలైనా పాడితే.. రాయల్టీ చెల్లించాలని.. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి పాటలు పాడకూడదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేటు రిజిస్టర్ సంస్థ అయినప్పటికీ..దాని నిబందనలకు అందరూ కట్టుబడి ఉండాలని..గతంలో ఆల్ ఇండియా రేడియో.. దూరదర్శన్ లలో ప్రోగ్రామ్ లకు రాయల్టీ ఇచ్చేవారని.. గతంలో ఇదే తీరులో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా రాయల్టీ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టబద్ధంగా బాలుకు నోటీసులు ఇచ్చే హక్కు ఇళయరాజాకు ఉందని.. కానీ అమెరికాలో పాడే సమయంలోనే ఎందుకు ఇచ్చారో అర్థం కావటం లేదన్నారు.
అయినా.. 50 ఏళ్ల నుంచి పాటలు పాడే బాలసుబ్రమణ్యానికి ఐపీఆర్ ఎస్ గురించి తెలీదా? చారిటీతో పాటు పాటలు పాడినా.. డబ్బులు తీసుకొని కచేరీలు నిర్వహించినా రాయల్టీ చెల్లించాల్సిందేనని.. ఈ వివాదం మీద సదరు సంస్థ కూడా స్పందించాలన్నారు. ఇంత వివాదం ఏల..? స్నేహితులైన ఆ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది కదా? అనివ్యాఖ్యనించారు. ఒకవేళ అదే వాతావరణం ఉండి ఉంటే.. ఇంత ఇష్యూ అయ్యేదే కాదేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/