Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ ఆల్ టైమ్ రికార్డు.. పవర్ స్టారా మజాకా!
By: Tupaki Desk | 4 April 2021 12:30 PM GMTమూడేళ్ల నుంచి పవన్ ఫ్యాన్స్ ఎంత ఆకలితో ఉన్నారో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 18 మినిలియన్లకు పైగా వ్యూస్, 1మిలియన్ లైక్స్ సాధించింది. ఈ దూకుడు ముందు నిలవలేక ఎన్నో రికార్డులు ధ్వంసమయ్యాయి. ఇక, సినిమా రిలీజ్ కు కేవలం ఐదు రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ ఆరాటానికి అంతులేకుండా పోతోంది.
దీంతో.. రిలీజ్ ఏర్పాట్లలో మునిగిపోయారు నిర్మాతలు. బోనీకపూర్, దిల్ రాజు కలిసి ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో సినిమా పోటీకి లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మాగ్జిమమ్ థియేటర్లలో సినిమాను విడుదల చేయబోతున్నారు.
రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2 వేల థియేటర్లలో, దేశవ్యాప్తంగా మరో రెండు వేల స్క్రీన్లలో వకీల్ సాబ్ ను దించబోతున్నట్టు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ లోనూ 700 చిల్లర థియేటర్లలో ప్లాన్ చేస్తున్నారట. కరోనా తర్వాత విదేశాల్లో ఇంత భారీగా రిలీజ్ అయిన మొదటి భారతీయ చిత్రం ఇదేనట.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారా? అని ఎదురు చూసిన ఫ్యాన్స్.. హాట్ కేకుల్లా టికెట్లు బుక్ చేసుకున్నారు. హైదరాబాద్ లో దాదాపు 94 శాతం థియేటర్లలో టిక్కెట్లన్నీ బుక్కయిపోయాయట. మిగిలిన ప్రాంతాల్లో ఓపెన్ చేసిన గంటల్లోనే అయిపోయాయట. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాకూ ఇలా టిక్కెట్లు బుక్ కాలేదని అంటున్నారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. ‘పవర్ స్టారా.. మజాకా!’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.