Begin typing your search above and press return to search.

ఇప్పుడైనా వకీల్ సాబ్ క్లారిటీ ఇస్తారా..??

By:  Tupaki Desk   |   16 April 2021 7:31 AM GMT
ఇప్పుడైనా వకీల్ సాబ్ క్లారిటీ ఇస్తారా..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే ఓ రేంజిలో సందడి నెలకొంటుంది. అలాంటిది తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. టోటల్ కలెక్షన్స్ గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. కానీ మేకర్స్ అంత త్వరగా సినిమా కలెక్షన్స్ వివరాలు బయటపెట్టరు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అలాంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే డే బై డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న రోజులివి. అన్ని సినిమాలు థియేటర్లోకి వచ్చినప్పటి నుండి అది వెళ్లిపోయే వరకు ఏ రోజు ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనే చర్చ డే ఎండింగ్ లో నడుస్తుంది. కానీ పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా వసూళ్లు మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు.

ఈ విషయంలోనే ఇండస్ట్రీ వర్గాలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇప్పటివరకు దిల్ రాజు వకీల్ సాబ్ కలెక్షన్స్ ఎందుకు బయటపెట్టలేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో మాత్రం అంచనాలు ఓ రేంజిలో వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్ విడుదలై నేటికీ వారం పూర్తవుతున్నా ఇంకా కలెక్షన్స్ పై క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ కలెక్షన్స్ అదరగొట్టిందని తెలుసు కానీ ఆ నెంబర్ ఎంత అనేది తెలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఇకనైనా దిల్ రాజు స్పందింస్తాడేమో చూడాలి. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శృతిహాసన్, నివేదా, అంజలి, అనన్య కీలకపాత్రలు పోషించారు.