Begin typing your search above and press return to search.
అఫీషియల్: 21 రోజులకే ఓటీటీలో 'వకీల్ సాబ్'
By: Tupaki Desk | 27 April 2021 11:32 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. ఇందులో శ్రుతి హాసన్ - నివేదా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తవడంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కి పెడుతున్నారు.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'వకీల్ సాబ్' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి అవుతుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓటీటీ వర్షన్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న కమర్షియల్ సినిమా అనుకునే విధంగా చూపించగా.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా అనుకునేలా ఓటీటీ ట్రైలర్ ని కట్ చేశారు.
వాస్తవానికి 'వకీల్ సాబ్' సినిమా విడుదలైన పది రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. రిలీజైన తర్వాత థియేట్రికల్ రన్ బాగుండటంతో మూడు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా నిర్మాత దిల్ రాజు ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈ వార్తలని మేకర్స్ ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎలాగూ థియేట్రికల్ రన్ పూర్తవడం.. థియేటర్స్ క్లోజ్ అవడంతో మూడు వారాలకే 'వకీల్ సాబ్' ను స్ట్రీమింగ్ పెడుతున్నట్లు అర్థం అవుతోంది.
ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో నటించిన సినిమా విడుదలైన 21 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. ఇకపోతే 'వకీల్ సాబ్' మాతృక బాలీవుడ్ 'పింక్' సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో అలరించిన 'వకీల్ సాబ్' ఓటీటీలో ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. కాగా, 'వకీల్ సాబ్' చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.