Begin typing your search above and press return to search.

వ‌కీల్ సాబ్ టైటిల్ వెన‌క ఆ ముగ్గు‌రు లాయ‌ర్ల స్ఫూర్తి

By:  Tupaki Desk   |   5 April 2021 1:30 PM GMT
వ‌కీల్ సాబ్ టైటిల్ వెన‌క ఆ ముగ్గు‌రు లాయ‌ర్ల స్ఫూర్తి
X
ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ పింక్ రీమేక్ ఆధారంగా తెర‌కెక్కినా కానీ తెలుగు ఆడియెన్ అభిరుచికి ప‌వ‌న్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని చేర్చారు. అయితే ఈ సినిమాకి మ‌గువ అనే టైటిల్ పెట్టాల‌నుకుని చివ‌రికి వ‌కీల్ సాబ్ అనే టైటిల్ ని నిర్ణ‌యించారు. ఇది కేవ‌లం ప‌వ‌న్ ఇమేజ్ ని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకున పెట్టుకున్న టైటిల్ అన్న ప్ర‌చారం సాగింది. కానీ ప‌వ‌న్ ప్రీరిలీజ్ వేడుక‌లో చెప్పిన దానిని బ‌ట్టి ఆ టైటిల్ వెన‌క చాలా మ‌ధ‌నం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ప్రీరిలీజ్ లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. వకీల్ సాబ్ అంటే నాకు తెలిసిన మొదటి వకీల్ నానీ పాల్కీవాలా. నాడు ఎమర్జెన్సీ స‌మ‌యంలో మానవ హక్కుల కోసం బలంగా వాదించిన ప్రముఖ లాయ‌ర్ ఆయ‌న‌. అన్నయ్య నాగబాబు లాయర్ కాబట్టి నానీ పాల్కీవాలా పుస్తకం చదివేవారు. ఆయన గురించి విన్న రోజు నుంచి నాకు లాయర్ వృత్తి మీద గౌరవభావం పెరిగింది. చుంటూరు దళితుల ఊచకోత కేసులో పేద‌ల వైపు నిలిచిన‌ భువనగిరి చంద్రశేఖర్ అనే మరో లాయర్ నాకు స్ఫూర్తి. చంద్రశేఖర్ కేన్సర్ తో కీమో థెరపీ తీసుకుంటూ కేసు వాదించారు. ఆయన చనిపోయారు. ఆయ‌న‌ నాకో పుస్తకం కూడా పంపారు. పేదల కోసం.. మానవ హక్కుల కోసం పాటుపడే చంద్రశేఖర్.. బాలగోపాల్ వంటి న్యాయవాదులంటే నాకు చాలా గౌరవం`` అని ప‌వ‌న్ అన్నారు. వ‌కీల్ సాబ్ పాత్ర‌లో చేయ‌డం అదృష్ట‌మ‌ని ఎమోష‌న్ అయ్యారు.

తాను ఇంట‌ర్ మ‌ధ్య‌లోనే వదిలేశాన‌ని అన్న ప‌వ‌న్ ఆధ్యాత్మిక‌త‌పైనా అద్భుత స్పీచ్ ఇచ్చారు. ``బాధ్యతలు ఉంటే ఆధ్యాత్మిక భావాలు రావు అని అన్న‌య్య‌ చిరంజీవి గారు చెప్పిన మాటలే నన్ను నటుడిని చేశాయి. ఆ మాటలే ఇవాళ రాజకీయాల్లోకి తీసుకెళ్లాయి. ముక్కు మూసుకుని ధ్యానం చేసేకంటే... మన సెల్ఫ్ రియలైజేషన్ కంటే కష్ట‌నష్టాలు అనుభవిస్తూ.. తిట్లు తింటూ కర్మ యోగం చేయడం కష్టం. నేను ఇవాళ కర్మ యోగం చేస్తున్నాను. ఆ ఆశీస్సులు భగవంతుడు నాకు ఇచ్చాడని అన్నారు. ప‌వ‌న్ స్పీచ్ తో వ‌కీల్ సాబ్ టైటిల్ వెన‌క ముసుగు తొల‌గిపోయి జ‌నాల‌కు క్లారిటీ వ‌చ్చింది.