Begin typing your search above and press return to search.
ఏపీలో కొనసాగుతున్న 'వకీల్ సాబ్' పంచాయితీ!
By: Tupaki Desk | 12 April 2021 5:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో వకీల్ సాబ్ విడుదల వేళ మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పంచాయితీ క్రమంగా రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే. టికెట్ల రేట్లు పెంచొద్దంటూ పలువురు అదనపు కలెక్టర్లు థియేటర్లకు ఆదేశాలు ఇవ్వడంతో.. కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో.. ఆ ఆదేశాలను కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత.. సినిమా టికెట్ల రేట్లు ఎంతుండాలనే విషయమై అధికారికంగా జీవో విడుదలైంది.
దీనిపై డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెంచుకోవడం ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని, వకీల్ సాబ్ కు కూడా ఆ వెసులుబాటు ఉండాలని కోరుతూ వస్తున్నారు. కొత్త జీవో నేపథ్యంలో ఆ అవకాశం లేకుండా పోయింది.
ఈ విషయమై మరోసారి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారట ‘వకీల్ సాబ్’ డిస్ట్రిబ్యూటర్లు. ఈ మేరకు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి, న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.