Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' కలెక్షన్స్: వసూల్ సాబ్ అనిపించుకున్నట్లేనా..?
By: Tupaki Desk | 24 April 2021 6:34 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ''వకీల్ సాబ్'' ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. అధికారికంగా బాక్సాఫీస్ లెక్కలు వెల్లడించనప్పటికీ ఇది పవన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచిందని ప్రచారం జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా ఆశించిన స్థాయిలో వసూళ్ళు రానప్పటికీ.. పవన్ గత చిత్రాల రికార్డులను 'వకీల్ సాబ్' బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.
'వకీల్ సాబ్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 90 కోట్ల వరకు జరగగా.. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 85 కోట్లు షేర్ వసూలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కల ప్రకారం ఏపీ మరియు తెలంగాణ - 77.52 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా - 3.58 కోట్లు.. ఓవర్సీస్ - 3.84 కోట్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 85.17 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు 81 కోట్లు సాధించిన 'అత్తారింటికి దారేది' రికార్డును 'వకీల్ సాబ్' తిరగరాసినట్లే. కాకపోతే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి ఇంకా 5 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది.
కాగా, బాలీవుడ్ 'పింక్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ''వకీల్ సాబ్'' కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. పవన్ లాయర్ గా నటించిన ఈ చిత్రంలో ఆయన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కర్షియల్ హంగులు జోడించారు. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పవన్ కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.