Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' అంతసేపు కూర్చోబెట్టగలడా..?
By: Tupaki Desk | 30 March 2021 7:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెరపై కనిపించనున్న సినిమా ''వకీల్ సాబ్''. శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. దీనికి తగ్గట్టే తాజాగా 'వకీల్ సాబ్' థియేట్రికల్ ట్రైలర్ విడుదలై రికార్డులు సృష్టిస్తోంది.
ట్రైలర్ ని బట్టి చూస్తే 'పింక్' సినిమాలో మెయిన్ పాయింట్ ని తీసుకొని చాలానే మార్పులు చేసినట్లు అర్థం అవుతోంది. పవన్ ఇమేజ్ కు దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సీక్వెన్సులు.. పాటలు పెడుతున్నారు. అలానే పవన్ కు ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేసి జోడీగా హీరోయిన్ శృతి హాసన్ కూడా పెట్టారు. అభిమానులు పవన్ నుంచి ఏమేం కోరుకుంటారో అన్ని కమర్షియల్ హంగులు ఉండేలా వేణు శ్రీరామ్ ఈ సినిమాని తీర్చిదిద్దాడని తెలుస్తోంది. ఈ క్రమంలో 'వకీల్ సాబ్' నిడివి కూడా పెరిగిపోయినట్లు టాక్ నడుస్తోంది.
మాతృక ‘పింక్’ సినిమా రన్ టైమ్ కేవలం 2 గంటల 16 నిముషాలు మాత్రమే ఉంటుంది. అయితే తెలుగులో ఒరిజినల్ వెర్షన్ లో లేని చాలా అంశాలను పెట్టడం వల్ల 'వకీల్ సాబ్' నడివి సుమారు 3 గంటలకు చేరిపోయిందట. ఇదే కనుక నిజమైతే ఈరోజుల్లో అంత పెద్ద సినిమా చూడటం కాస్త కష్టమేనని చెప్పవచ్చు. 'అర్జున్ రెడ్డి' 'రంగస్థలం' వంటి సినిమాలు ఎక్కువ నిడివితో కూడా ప్రేక్షకులను థియేటర్స్ లో కూర్చోబెట్టారు. అలానే కొన్ని సినిమాలు లెంత్ కారణంగా ప్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ కోర్ట్ డ్రామాతో ఆడియన్స్ ని అంతసేపు థియేటర్ లో ఉంచగలరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం పవన్ ఎంత సేపు స్క్రీన్ పైన కనిపించినా చూస్తారని.. నిడివి ఎంత ఉన్నా బొమ్మ బ్లాక్ బస్టర్ అని నమ్మకంగా ఉన్నారు.