Begin typing your search above and press return to search.
`వకీల్ సాబ్`కి అంత సీనుందంటారా?
By: Tupaki Desk | 20 July 2020 7:50 AM GMTపింక్ వర్సెస్ నెరక్కొండ పార్వవై వర్సెస్ వకీల్ సాబ్.. ప్రస్తుతం ఆసక్తికర టాపిక్ ఇది. బాలీవుడ్ లో పింక్ బంపర్ హిట్. పింక్ ఎలాంటి అంచనాలు.. ఓవర్ యాక్షన్స్ లేకుండా బాలీవుడ్ లో ఉన్న మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. అలానే అమితాబ్ లాంటి ఇంటర్నేషనల్ యాక్టర్ కి తగ్గ పాత్ర.. కథ కావడంతో పింక్ బాలీవుడ్ లో హిట్టయ్యింది.
`నెరక్కొండ పార్వవై` అనే టైటిలో అజిత్ హీరోగా హిందీ పింక్ ని తమిళంలోకి రీమేక్ చేశారు. తమిళంలో ఒక్క ఫైట్ మినహా ఇది మొత్తం హిందీ పింక్ మాదిరిగానే ఉంటుంది. కమర్షియల్ హీరోగా అజిత్ కి తమిళంలో యమ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అజిత్ డీసెంట్ నటనతో పింక్ కథ రూపు రేఖలు మార్చేశాడు. అమితాబ్ ని మైమరిపించాడు. దీంతో తమిళంలో కూడా పింక్ కథ హిట్ అయింది.
ఇది ఇప్పుడు తెలుగులో రీమేకై ఎలాంటి ఫలితం అందుకోబోతోంది? అన్నది సస్పెన్స్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వకీల్ సాబ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్టుని పూర్తి కమర్షియల్ గా మార్చి హిట్టు కొట్టాలనుకున్నారా? లేక యథాతథంగా తమిళ వెర్షన్ తరహాలోనే దించేస్తారా? అన్నదానిని బట్టి ఇక్కడ హిట్టు డిసైడ్ అవుతుందేమో! తెలుగు ఆడియెన్ ఇంతకుముందుతో పోలిస్తే మారారు. నేటివిటీ.. సహజసిద్ధతకు కనెక్టవుతున్నారు. కథనం ఇంట్రెస్టింగ్ గా ఉండి ఓవరాక్షన్లు లేకపోతే ఇక్కడా ఎక్కొచ్చు. కానీ వేణుశ్రీరామ్ - దిల్ రాజు బృందం అందుకు తగ్గట్టే పవర్ స్టార్ ని చూపిస్తున్నారా? అన్నదే అసలైన ప్రశ్న. హిందీ నుంచి తెలుగుకి రీమేక్ అయిన `గోపాల గోపాల` చిత్రంలో పవన్ ని డీసెంట్ రోల్ లో చూపిస్తే క్రిటిక్స్ పొగిడారు కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. అలా కాకుండా ఈసారి `వకీల్ సాబ్` ఎలాంటి మిరాకిల్స్ చేయబోతున్నాడు? అన్నది చూడాలి.