Begin typing your search above and press return to search.
‘వకీల్‌సాబ్’ ఓటీటి..ఓ నెగిటివ్ కోణం
By: Tupaki Desk | 28 April 2021 3:03 AM GMTఏప్రియల్ 9న థియేటర్లలో విడుదలై మంచి హిట్టైన చిత్రం ‘వకీల్‌సాబ్’.హిందీలో విజయవంతమైన ‘పింక్’ రీమేక్‌గా శ్రీరామ్ వేణు ‘వకీల్‌సాబ్’ను తెరకెక్కించారు. సత్యదేవ్‌గా లాయరు పాత్రలో అదరగొట్టారు పవన్ కల్యాణ్. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ ఇండియా ట్వీట్ చేసి కన్ఫార్మ్ చేసింది. ఈ వార్త చాలా మంది సినీ అభిమానులకు, థియోటర్ లో ఈ సినిమా చూడనివారికి ఆనందం కలిగించింది. అదే సమయంలో ఓ కొత్త చర్చ మొదలైంది.
నాలుగు వారాలు కూడా గ్యాప్ లేకుండా ఇలా ఓటీటిలో రిలీజ్ చేస్తే ఆ తర్వాత రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు సమస్య వస్తుందంటున్నారు. ఇంతకు ముందు విజయ్ మాస్టర్ కు అలాగే చేసారు. ఇప్పుడు ‘వకీల్‌సాబ్’ ని ఓటీటికు ఇచ్చేసారు. కేవలం 21 రోజుల వ్యవధిలో ఓటీటిలో వచ్చేయటం..అదీ పవన్ వంటి పెద్ద స్టార్ సినిమా కావటంతో...రాబోయే పెద్ద సినిమాలు ఇలాగే అతి తక్కువ టైమ్ లో ఓటీటిలో వచ్చేస్తాయి కదా అని జనం థియోటర్ కు వెళ్లటం మాని ఎదురుచూడటం మొదలెడతారు. అది రెవిన్యూ పరంగా సినిమాలకు పెద్ద దెబ్బ అని ట్రేడ్ లో విశ్లేషిస్తున్నారు.
కొద్దికాలం క్రితం నిర్మాతలు అంతా మాట్లాడుకుని థియేటర్ రిలీజ్ కు, ఓటీటి లేదా శాటిలైట్ ప్రీమియర్ రిలీజ్ కు మధ్య నాలుగు నుంచి ఆరు వారాల మినిమం గ్యాప్ ఉండేలా చూసుకోవాలని ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే కరోనా వచ్చి రూల్స్ అన్నిటిని ప్రక్కన పెట్టేలా చేస్తోంది. నిజానికి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని ఫస్ట్ వీక్ బాక్సాఫీస్‌ని వద్ద రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ సినిమా కరోనా దెబ్బతో చతికిలపడింది. ఇప్పటికే చూడనివాళ్లు, రిపీట్ ఆడియన్స్ థియోటర్ కు వెళ్లటానికి జంకుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ సినిమా ఓటీటి రిలీజ్ కు ప్రాధాన్యత ఏర్పడింది.
అలాగే ‘వకీల్‌సాబ్’ను ఓటీటీలో విడుదల చేసే విషయంలో అనేక వార్తలు మీడియాలో హల్ చల్ చేసాయి. ప్రొడక్షన్ హౌస్ వాటన్నింటినీ ఖండించింది. దిల్ రాజు కూడా ఇప్పుడిప్పుడే ఓటీటీలో రాదు ..థియోటర్ లోనే చూడండి అన్నారు. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేశారు. దీంతో పవన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయక తప్పలేదు. ప్రతీసారీ ఇలాగే జరగాలని రూల్ లేదు.