Begin typing your search above and press return to search.
బ్రేక్ ఈవెన్ కి `వకీల్ సాబ్` ఎంత వసూలు చేయాలి?
By: Tupaki Desk | 7 April 2021 5:37 AM GMTపవన్ కథానాయకుడిగా నటించిన వకీల్ సాబ్ ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి వస్తున్నా మాస్ లో పవన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదని తాజా ఫీవర్ తెలియజేస్తోంది. ఈ సినిమాకి జరిగిన బిజినెస్.. అలాగే వసూళ్ల అంచనా ప్రతిదీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే థియేటర్ల నుంచి ఎంత వసూలు చేయాలి? అంటే.. ఏకంగా 120కోట్లు షేర్ రిటర్నులు తేవాలని పంపిణీవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
వకీల్ సాబ్ సినిమా బడ్జెట్ దాదాపుగా 85 కోట్లు. అయితే పవన్ మీదున్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకు దిల్ రాజు బాగానే బిజినెస్ చేసుకున్నారు. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ అన్ని కలిసి మొత్తం మీద వకీల్ సాబ్ అటు ఇటు గా ఓ 155 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఇందులో 30 కోట్లు డిజిటిల్ అలానే శాటిలైట్ ద్వారా ఆర్జిస్తే మిగతా మొత్తం థియేట్రికల్ మీద వచ్చింది. వకీల్ సాబ్ రూపంలో దిల్ రాజు ఇప్పటికే 25 కోట్లు లాభాల్లో ఉన్నట్లేనని ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే పీకే సినిమాలు హిట్ అయితే మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఓవర్ ది నైట్ స్టార్లు అయిపోతారు. ఫ్లాప్ అయితే మాత్రం భారీగా నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి వకీల్ సాబ్ పై వస్తున్న టాక్ చూస్తే.. సెకండాఫ్ బాగుందన్న గుసగుస వినిపిస్తోంది. మాస్ మసాలా కథలు ఇష్టపడే తెలుగు ఆడియెన్స్ ఓ 65 నిమషాల పాటు కోర్ట్ రూమ్ వాదోప వాదాలు మీద నడిచే సన్నివేశాల్ని ఎంతవరకూ ఎంజాయ్ చేస్తారన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్. కోర్టు సన్నివేశాల్లోనూ ఆడియెన్ కదలకుండా కుర్చీ అంచున కూచోగలిగితే అది రిజల్ట్ రూపంలో కనిపిస్తుందని భావిస్తున్నారు. మరో రెండ్రోజుల్లోనే అసలు రిజల్ట్ తేలనుంది.