Begin typing your search above and press return to search.
క్రైసిస్ లోనూ టాప్ 10లో నిలిచిన వకీల్ సాబ్
By: Tupaki Desk | 16 April 2021 5:12 AM GMTహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కలెక్షన్ల రికార్డులు ఎప్పుడూ హాట్ టాపిక్. టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు రిలీజవుతున్నాయంటే ఎక్స్ రోడ్స్ లో కనిపించే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవల రిలీజైన వకీల్ సాబ్ మానియా ఇక్కడ ఓ రేంజులోనే కొనసాగింది. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నగరంలో ఎక్కువగా ఉన్నా కానీ మరోవైపు వకీల్ సాబ్ బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగింది. ఇంత క్రైసిస్ లోనూ ఎక్స్ రోడ్స్ కలెక్షన్స్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి.
ఆర్టీసీ ఎక్స్-రోడ్స్ లో వకీల్ సాబ్ 10 వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మొదటి వారాంతం తరువాత వసూళ్లు డ్రాపైనా కానీ ఫర్వాలేదనిపించింది. ఉగాది రోజున కలెక్షన్లలో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్-రోడ్స్ లో మొదటి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో వకీల్ సాబ్ 10 వ స్థానంలో నిలిచింది. కోవిడ్ వేవ్ వారం తరవాత పెద్ద దెబ్బ కొట్టింది. ఈ బుధ- గురువారాలకు మాత్రం కలెక్షన్స్ పడిపోయాయని తెలిసింది. మొదటి వారం చివరి నాటికి ఈ చిత్రం టాప్ -5 జాబితాలో నిలబడలేకపోయింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వారం టాప్ 10 గ్రాసర్స్ ని పరిశీలిస్తే... బాహుబలి 2 - రూ .16.7 కోట్లు.. సాహో - రూ .11.7 కోట్లు.. సరిలేరు నీకెవ్వరు - రూ .1.04 కోట్లు వసూలు చేశాయి. మిగతా సినిమాలు కోటి లోపు వసూళ్లను సాధించాయి. అల వైకుంఠపురములో- రూ 9295797 లక్షలు.. మహర్షి - రూ 9212430 లక్షలు.. బాహుబలి 1 - రూ .9117904 లక్షలు.. రంగస్థలం - రూ 8976555 లక్షలు.. 2 పాయింట్ 0 - రూ - 8512217లక్షలు.. సైరా - రూ .8422065 లక్షలు.. వకీల్ సాబ్ - రూ 8305283 లక్షలు వసూలు చేశాయి.