Begin typing your search above and press return to search.

‘వ‌కీల్ సాబ్’ థియేట‌ర్లు సీజ్ చేసిన అధికారులు!

By:  Tupaki Desk   |   12 April 2021 5:30 AM GMT
‘వ‌కీల్ సాబ్’ థియేట‌ర్లు సీజ్ చేసిన అధికారులు!
X
పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏపీలో పంచాయితీ కోర్టుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. మ‌రో రాష్ట్రంలో థియేట‌ర్ల‌ను మూసేశారు. దీంతో.. సినిమాకు మ‌రోసారి ఎదురు దెబ్బ తగిలిన‌ట్టైంది.

తెలుగు సినిమాలు ఒడిశా రాష్ట్రంలోని ప‌లు చోట్ల రిలీజ్ అవుతుంటాయి. ప్ర‌ధానంగా శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నానికి స‌రిహ‌ద్దుగా ఉన్న ప‌ర్లాఖెముండి అనే ప‌ట్ట‌ణంలో ప్ర‌తీ సినిమా విడుద‌ల‌వుతూ ఉంటుంది. దీనికి కార‌ణం.. ఇక్క‌డ తెలుగు వారు అధిక సంఖ్య‌లో ఉండ‌డ‌మే. తాజాగా వ‌కీల్ సాబ్ సినిమా ‘జై మా’, ‘లక్ష్మీ’ టాకీసులలో సినిమా విడుదలైంది. ఈ సినిమా చూడ‌డానికి జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. దీంతో.. అధికారులు థియేట‌ర్ల‌ను మూసేసిన‌ట్టు తెలిసింది.

ఒడిశాలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంది. దీంతో.. ప‌లు జిల్లాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే థియేట‌ర్లు న‌డ‌వాల‌ని అధికారులు ఆదేశించారు. అందులో ఈ ప్రాంతం కూడా ఉంది. కానీ.. థియేట‌ర్ య‌జ‌మానులు నిబంధ‌న‌లు ఉల్లంఘించి, ప్రేక్ష‌కులంద‌రికీ టికెట్లు ఇచ్చేసారని తెలుస్తోంది. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు.

కొవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు గానూ రెండు థియేట‌ర్ల‌ను మూసేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ట్టు స‌మాచారం. ఆ రెండు థియేట‌ర్ల‌ను సీజ్ చేయ‌డంతోపాటు య‌జ‌మానుల‌కు రూ.10 వేల చొప్పున జ‌రిమానా విధించిన‌ట్టు తెలిసింది.