Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' కమర్షియల్ గా సక్సెస్ అవుద్దా...?
By: Tupaki Desk | 28 March 2020 2:00 PM GMTరెండేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా విశేష స్పందన లభించింది. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న ఈ చిత్రం మీద అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు లేవని అనుకుంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.
ఈ మధ్య ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ 'మగువా మగువా...'విడుదలైన విషయం తెలిసిందే. కానీ వెంటనే కరోనా ఎటాక్ చేయడంతో ఈ పాట గురించి పట్టించుకొనే వాళ్లే లేకపోయారు. ఈ పాట బాగానే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఉండే మాస్ ఫ్యాన్స్ కి ఈ పాట పెద్దగా ఎక్కడం లేదని టాక్. ఈ కరోనా డేస్ లో ఖాళీగా ఉన్నా కూడా ఈ పాటను పీకే ఫ్యాన్స్ వినడం లేదంట. ఈ పాట వాళ్ళకి నచ్చలేదనడానికి ఇదే రుజువు. అందులోనూ ఈ సినిమా ఇతర భాషల్లో కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పటికే హిందీ తమిళ భాషల్లో ఆల్రెడీ చూసేసారు. అంతేకాకుండా బిసినెస్ పరంగా కూడా ఈ సినిమా దిల్ రాజుకు నష్టాలను తెచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోయింది. డిస్టిబ్యూటర్స్ సినిమాను కొన్న నేపథ్యంలో ఈ సినిమా బాగుంటే పర్వాలేదు. ఒకవేళ సినిమా అటూఇటూ గాని అయితే డబ్బులు కట్టే పరిస్థితులు లేవు. ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటే 'వకీల్ సాబ్' కమర్షియల్ గా వర్క్ ఔట్ అవదనే అంచనాలకి వస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్డమ్ ఈ అంచనాలను తారుమారు చేస్తుందేమో చూడాలి.