Begin typing your search above and press return to search.
పాత బస్తీలో వకీల్ సాబ్ మొదలెట్టేశారు
By: Tupaki Desk | 1 Nov 2020 5:00 PM GMTకరోనా దెబ్బకు ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏడెనిమిది నెలలుగా షూటింగుల్లేవ్ థియేటర్లు తెరవడాల్లేవ్. దీంతో సినీపరిశ్రమలో ఒకరకమైన స్తబ్ధత నెలకొంది. అయితే ఈ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తిని రేపుతోంది.
ఇక ఈ లాక్ డౌన్ పీరియడ్ లోనే పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్షలో నాలుగు నెలలు ఉన్నారు. ఇది ఇప్పటికే పూర్తయింది. ఈ నటుడు ఈ రోజు నుండి తిరిగి వకీల్ సాబ్ సెట్స్ కి తిరిగి జాయిన్ అయ్యారని తెలుస్తోంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షూటింగ్ ప్రారంభమైంది. పవన్ పది రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ కొనసాగిస్తాడు. ఆ తర్వాత విరామం తీసుకుంటాడు. వకీల్ సాబ్ మొత్తం షూట్ డిసెంబర్ మధ్య నాటికి పూర్తవుతుంది.
శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2021 విడుదల చేయాలన్నది టార్గెట్. ఈ మూవీ కథాంశం ఆసక్తికరం. కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమిది. అంజలి- నివేదా థామస్- అనన్య - ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు - బోనీ కపూర్ సంయుక్తగా నిర్మిస్తున్నారు.
అలాగే పవన్ దీని తర్వాత మూడు సినిమాలు చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ జనవరి 2021 నుండి అయ్యప్పనమ్ కోషియం రీమేక్ షూట్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.