Begin typing your search above and press return to search.

'నా పేరు సూర్య ..' బ‌న్నీ కోసం చేసిన క‌థ కాదా?

By:  Tupaki Desk   |   23 Nov 2022 3:30 PM GMT
నా పేరు సూర్య .. బ‌న్నీ కోసం చేసిన క‌థ కాదా?
X
సినీ ఇండ‌స్ట్రీలో డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యామ‌ని చెప్పిన వాళ్లున్నారు.. డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ లుగా రాణించిన వాళ్లూ వున్నారు. వ‌క్కంతం వంశీ మాత్రం యాక్ట‌ర్ కావాల‌నుకుని ఫైన‌ల్ గా రైట‌ర్, డైరెక్ట‌ర్ అయ్యారు. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు రూపొందించిన 'కల్యాణ ప్రాప్తిర‌స్తు' మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మైన వ‌క్కంతం వంశీ హీరోగా కంటిన్యూ కావాల‌నుకున్నాడు కానీ సినిమా ఆడక పోవ‌డంతో త‌న రూట్ ని రైటింగ్ వైపు మ‌ళ్లించాడు.

అల్లు అర్జున్ న‌టించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' మూవీతో ద‌ర్శ‌కుడిగా మారిన వ‌క్కంతం వంశీ ప్ర‌స్తుతం నితిన్ హీరోగా ఓ మూవీని తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నడు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ఆలీ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వ‌క్కంతం వంశీ ప‌లు ఆస‌క్తిక‌ర విశేషాల్ని వెల్ల‌డించాడు. 'ప్రేమ కోసం' మూవీతో స్టోరీ రైట‌ర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయ‌న 'కిక్‌'తో రైట‌ర్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

ప్ర‌స్తుతం అఖిల్ హీరోగా న‌టిస్తున్న 'ఏజెంట్‌' కు క‌థ అందించింది వ‌క్కంతం వంశీనే. త్వ‌ర‌లో నితిన్ 32వ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో వ‌క్కంతం వంశీ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఎన్టీఆర్ ద్వారా త‌న‌కు సురేంద‌ర్ రెడ్డి ప‌రిచ‌యం అయ్యార‌ని, త‌న‌తో క‌లిసి ప్ర‌యాణం మొద‌లైన త‌రువాత త‌న సినిమాలు ఫ్లాప్ కావ‌డం మొద‌లైంద‌న్నాడు.

ఆ కార‌ణంగానే తాను ఇక‌పై నీతో క‌లిసి ప‌ని చేయ‌న‌ని చెప్పాడ‌ట‌. ఫైన‌ల్ గా ఇద్ద‌రు క‌లిసి 'కిక్‌' సినిమాకు వ‌ర్క్ చేస్తే అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిందని, అక్క‌డి నుంచి సురేంద‌ర్ రెడ్డితో క‌లిసి ప‌ని చేచ‌య‌డం ఆప‌లేద‌న్నాడు.

తార‌క్ వ‌ల్ల 'టెంప‌ర్‌' ఐడియాని పూరి జ‌గ‌న్నాథ్ కు వినిపించాన‌ని, త‌న‌కు స‌గం వ‌న‌గానే న‌చ్చేసింద‌న్నాడు. అయితే పూరి చెప్పిన క్లైమాక్స్ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, అ విష‌యం చెప్పాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని, గంట త‌రువాత చెబితే పూరి అన్నంతింటున్న ప్లేట్ ని తీసేసి క‌డుపు నిండిపోయింద‌న్నాడ‌ని తెలిపాడు.

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ' బ‌న్నీ కోసం చేసిన క‌థ కాద‌ని ఎన్టీఆర్ కోసం అనుకున్న క‌థ‌ని స్ప‌ష్టం చేశాడు. మూడేళ్ల పాటు ఈ క‌థ రాశాన‌ని, అయితే ఎన్టీఆర్ ని ఊహించుకుని క‌థ రాస్తుంటే కుద‌ర‌లేదు..దాంతో ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టా. ఓ స్నేహితుడి ద్వారా ఆ క‌థ బ‌న్నీ దాకా వెళ్లింది. క‌థ విన్న వెంట‌నే బ‌న్నీ ఓకే అన్నాడు. స్క్రీన్ ప్లే విష‌యంలో మ‌రింత‌గా జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే బాగుండేది అంటూ ఈ మూవీ విష‌యంలో జ‌రిగిన త‌ప్పిదాన్ని వెల్ల‌డించాడు వ‌క్కంతం వంశీ.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.