Begin typing your search above and press return to search.
ఒక్క ఓటమితోనే అంతా అయిపోయిందనుకుంటే ఎలా?
By: Tupaki Desk | 28 Nov 2019 1:30 AM GMTఒక మనిషిలో ఉండే జెన్యూన్ క్యారెక్టర్ ఎప్పటికీ వదిలిపోదు. పరిస్థితుల ప్రభావం వల్ల కొంతకాలం అణగిమణిగి ఉండొచ్చేమో కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ని ఎక్కువ కాలం దాచి పెట్టలేం! అంటూ ఎంతో ఎనలైజ్ చేసిన చిత్రం `నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా`. ఈ సినిమాతోనే రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. స్టార్ హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ ని పీక్స్ లో ఎలివేట్ చేసిన ఈ చిత్రం రకరకాల కారణాలతో ఫ్లాప్ అవ్వడం ఎంతో నిరాశపరిచింది. ఆర్మీ నేపథ్యం.. వ్యక్తిత్వం.. క్యారెక్టర్ అంటూ సీరియస్ టోన్ తో తీసిన చిత్రమిది. దీంతో ఇందులో స్పీచ్ లు ఎక్కువ ఇచ్చారని.. అసలు అంతిమంగా ఏం చెప్పదలిచారో అర్థం కాలేదని.. హిట్టుకు అవసరం అయ్యే కామెడీ అన్నదే మిస్సయ్యిందని రకరకాలుగా విమర్శలు వచ్చాయి. అయితే వక్కంతం తాను ఏది నమ్మాడో అది తీసి జనాలకు చూపించాడు.
ఇక ఈ సినిమాలో వక్కంతంలోని రైటర్ ఎక్కడా ఫెయిల్ కాలేదు. అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎక్కడా మిస్ ఫైర్ కాలేదు. యాక్షన్ కింగ్ అర్జున్ తో బన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. కానీ జనాలు ఇంకేదో ఆశించడం.. దానికి తోడు క్రిటిసిజం ఈ సినిమాని పెద్ద దెబ్బ కొట్టాయి. ఎన్నో హోప్స్ పెట్టుకుని ప్రాణం పెట్టి నటించిన బన్నికి ఇది పెద్ద నిరాశే అయ్యింది. సినిమా ఫెయిల్ అన్న టాక్ స్ప్రెడ్ అయ్యాకా వక్కంతం పనితనం గొప్పగా ఉందని బన్ని పొగిడిన సందర్భాలున్నాయి.
అందుకే ఇప్పుడు డెబ్యూగా ఫెయిలైన వక్కంతం తిరిగి రెండో సినిమా చేస్తున్నారు అనగానే పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. గత కొంతకాలంగా అతడి ప్రయత్నంపై అడపాదడపా లీకులు అందుతూనే ఉన్నాయి. డెబ్యూ సినిమా ఫ్లాపవ్వడంతో వక్కంతం ఓ రకంగా తీవ్ర నిరాశకు లోనై చాలా కాలంగా ఫిలింసర్కిల్స్ లో కనిపిస్తున్నది లేదు. అయినా అతడు ఏదో పంతంతో ఉన్నాడని .. ఇప్పుడు మరో స్క్రిప్టును రెడీ చేసి నిర్మాతలు.. హీరోల్ని కలుస్తున్నారని ప్రచారం అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఓ యంగ్ మెగా హీరోతో వక్కంతం సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బాస్ అల్లు అరవింద్ కి కథను వినిపించారని ప్రచారమవుతోంది. అంతేకాదు అరవింద్ ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తారన్న ప్రచారం వేడెక్కిస్తోంది. `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా` చిత్రానికి లగడపాటి శ్రీధర్- నాగబాబు బృందంతో కలిసి జీఏ 2 అధినేత బన్ని వాసు ఒక నిర్మాతగా కొనసాగారు. అంటే ఆ స్క్రిప్టులో బాస్ అరవింద్ ఇన్ పుట్స్ ఎన్నో ఉండి ఉంటాయి. మరి ఇప్పుడు వక్కంతంపై నమ్మకంతోనే మరో ఛాన్స్ గీతా ఆర్ట్స్ లోనే ఇచ్చారా? అన్నది ఆయనే చెప్పాల్సి ఉంది. తొలి ఎటెంప్ట్ ఫెయిలైనా.. వక్కంతంలోని రైటర్ కం దర్శకుడిని నమ్మి మరో ఛాన్సిస్తున్నారా? అన్నది చూడాలి. ఆరంభం ఫెయిలై నిరూపించుకున్న వాళ్లెందరో. ఒకటో మ్యాచ్ లో ఫెయిలయ్యాకే టీమిండియా కెప్టెన్లు అయిన వాళ్లున్నారు. వరల్డ్ కప్ పోరులో బెస్ట్ సెంచరీలతో చెలరేగిన వాళ్లు ఉన్నారు. మరి వక్కంతంకి ఈ రెండో ఛాన్స్ ఇస్తే తప్పేమీ కాదు. మరి ఏం జరగబోతోంది అన్నది చూడాలి.