Begin typing your search above and press return to search.
వక్కంతం.. బన్నీ కాంపౌండ్లోనే
By: Tupaki Desk | 5 Sep 2018 5:41 AM GMTగత దశాబ్ద కాలంలో టాలీవుడ్లో ఎంతోమంది రచయితలు దర్శకులుగా మారారు. చిన్న స్థాయి రైటర్లకు కూడా మంచి అవకాశాలు దక్కాయి. అందులో కొంతమంది నిలదొక్కుకున్నారు. రచయితగా మరీ గొప్ప పేరేమీ సంపాదించని కొరటాల శివ.. దర్శకుడిగా మాత్రం చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. ఐతే రచయితగా స్టార్ స్టేటస్ సంపాదించిన వక్కంతం వంశీ మాత్రం దర్శకత్వ కలను నెరవేర్చుకోవడానికి చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ ఎదురు చూపులు ఫలిస్తూ అతను ఏకంగా అల్లు అర్జున్ లాంటి బడా హీరోతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ‘నా పేరు సూర్య’ ప్రోమోలు కూడా ఆకట్టుకోవడంతో వక్కంతం దర్శకుడిగా కూడా ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తిరగబడ్డాయి. ఆ సినిమా డిజాస్టర్ అయింది.
దీంతో వక్కంతం పరిస్థితి ఎటూ కాకుండా అయిపోయింది. అంతకుముందు చర్చల్లో ఉన్న ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇప్పటిదాకా వక్కంతం మరో సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. అతనిప్పుడు ఏం చేస్తున్నాడన్న దానిపై స్పష్టత లేదు. ఐతే ‘నా పేరు సూర్య’ కోసం వక్కంతం పడ్డ కష్టం.. అతడి ప్రతిభ చూసి ఇంప్రెస్ అయిన బన్నీ.. ఆ చిత్ర ఫలితాన్ని పట్టించుకోలేదని.. అతడిని విడిచిపెట్టలేదని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటికే మొదలు కావాల్సిన ఈ చిత్రం స్క్రిప్టు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వాయిదా పడింది. ఈ చిత్రం విక్రమ్ స్టయిల్లో కొంచెం సీరియస్ గా సాగుతుందట. అందులో ఎంటర్ టైన్మెంట్ టచ్ పెంచే బాధ్యతను వక్కంతంకు అప్పగించినట్లు చెబుతున్నారు. ‘నా పేరు సూర్య’లో అది మిస్సవడం వల్లే సినిమా ఆడలేదు. ఐతే నిజానికి వక్కంతం ఎంటర్టైనింగ్ సీన్లు రాయడంలో దిట్ట. ‘కిక్’.. ‘రేసు గుర్రం’ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే విక్రమ్ స్క్రిప్టుకు ‘ఎంటర్ టైన్ మెంట్’ మెరుగులు దిద్దే పనిని అతను చూస్తున్నట్లు గీతా ఆర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.