Begin typing your search above and press return to search.

'ఖాకీ'ని మించిన థ్రిల్ 'వలిమై' ఇస్తుంది!

By:  Tupaki Desk   |   23 Feb 2022 8:31 AM GMT
ఖాకీని మించిన థ్రిల్ వలిమై ఇస్తుంది!
X
తమిళనాట ఇప్పుడు అంతా కూడా 'వలిమై' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి అందరిలో మరింతగా ఆత్రుత .. ఆసక్తి పెరిగిపోతున్నాయి. అజిత్ మంచి బైక్ రేసర్ .. ఆయనకి బైక్స్ నడపడం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో బైక్స్ పై ఛేజింగ్ సీన్స్ ఒక రేంజ్ లో ఉండనున్నాయి.

తూనీగల గుంపులా తెరపై బైక్స్ దూసుకెళుతుండటం ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కి గురిచేస్తుంది. ఎంతో రిస్కీగా కనిపించే ఈ చేజింగ్స్ లో డూప్ లేకుండా అజిత్ పాల్గొనడం విశేషం. అందువలన ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

బోనీ కపూర్ నిర్మాతగా అజిత్ హీరోగా ఇంతకుముందు తమిళంలో 'నెర్కొండ పార్వై' సినిమాను చేసిన వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

అంతేకాదు ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన 'శతురంగ వేట్టై' .. 'ఖాకి' సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కార్తి హీరోగా చేసిన 'ఖాకీ' తమిళంలో మాత్రమే కాదు .. తెలుగులో కూడా హిట్ కొట్టింది. యాక్షన్ సీన్స్ లో .. పోలీస్ కథల్లో ఒక కొత్త ఒరవడిని వినోద్ ఈ సినిమాతో తీసుకొచ్చాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మంచి రేటింగును రాబడుతోంది. అలాంటి ఒక దర్శకుడి నుంచి 'వలిమై' వచ్చింది.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అజిత్ .. దోపిడీ దొంగల ముఠా నాయకుడిగా కార్తికేయ కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తరువాత, ఇది తమిళ సినిమానా? హాలీవుడ్ సినిమానా? అనుకున్నారు. ఆ స్థాయిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా ఈ నెల 24వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై దర్శకుడు వినోద్ మాట్లాడుతూ .. "గతంలో నా దర్శకత్వంలో వచ్చిన 'ఖాకీ'ని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆదరించారు. అంతకు మించిన థ్రిల్ 'వలిమై' ఇస్తుంది.

25వ తేదీన 'భీమ్లా నాయక్' రాబోతోంది. దానికి ముందుగానే 'వలిమై' చూసేయండి. ఒకవేళ ఆ రోజున టికెట్స్ దొరక్కపోతే ఆ తరువాతైనా చూడండి. ఈ సినిమా సమయంలోనే కరోనా ఫస్టు వేవ్ .. సెకండ్ వేవ్ చూశాము. అయినా ఎంత బడ్జెట్ అయినా ఫరవాలేదని బోనీ సార్ చెప్పారు. అలా ఒక పెద్ద బడ్జెట్ లో ఈ సినిమాను తీయడం జరిగింది. యాక్షన్ లో గానీ .. సెంటిమెంట్ లో గాని ఈ సినిమా మీకు ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. మీరంతా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.