Begin typing your search above and press return to search.
తెలుగులో స్టార్ హీరో మళ్లీ ఫెయిలయ్యాడు
By: Tupaki Desk | 26 Feb 2022 3:30 AM GMTకోలీవుడ్ లో అత్యధిక క్రేజ్ వున్న హీరోల్లో అజిత్ కు ప్రత్యేకత వేరు. ఆయనకున్న క్రేజ్ వేరు. తమిళనాట అజిల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఎంత పాపులర్ అంటే అజిత్ ఏది చేసినా ఓ స్టైల్ అని అభిమానులు ఫాలో అయ్యే అంత. సాల్ట్ పెప్పర్ లుక్ లో కనిపించినా అది ట్రెండ్ గా మారిపోయింది. ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న అజిత్ తెలుగు ప్రేక్షకుల్ని మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమ సత్తాని చాటాలని ప్రయత్నించిన ప్రతీ సారి విఫలమవుతూనే వున్నాడు.
ఎంత ప్రయత్నించినా అజిత్ ఇక్కడ అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నాడు. అజిత్ హీరోగా నటించిన తాజా చిత్రం `వలిమై`. బోనీ కపూర్ నిర్మించిన ఈ మూవీ తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లని రాబట్టలేకపోయింది. గతంలో అజిత్ నటించిన విశ్వాసం - వివేకం - వీరం వంటి చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేక విఫలమయ్యాయి.
గత చిత్రాల తరహాలోనే `వలిమై` కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. అజిత్ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ లభించకపోవడానికి ప్రధాన కారణం ప్రచారం లేకపోవడమే. కనీసం తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రమోషన్స్ లో ఒక్కసారైనా అజిత్ కనిపించలేదు. అదే అతని చిత్రాలకు తెలుగులో బిగ్ డ్రాబ్యాక్ గా మారుతోంది. తమిళ హీరోలైన సూర్య - కార్తి తమ సినిమాలు తెలుగులో విడుదలైన సందర్భంలో ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ ఖచ్చితంగా వస్తుంటారు. తమ సినిమాని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తుంటారు.
ఇందు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తున్నారు. ఇక్కడ తమ మార్కెట్ ని పెంచుకుంటున్నారు. కానీ అజిత్ మాత్రం తమిళంలోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండానే అక్కడ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అది తెలుగులో మాత్రం వర్కవుట్ కావడం లేదు. `వలిమై` చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు కార్తీతో చేసిన `ఖాకీ` తెలుగులో బారీ విజయాన్ని సాధించి అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ `వలిమై`తో మాత్రం ఆ ఫీట్ ని రిపీట్ చేయలేకపోయాడు.
అజిత్ తెలుగులో ప్రమోషన్స్ కి రాకపోవడం `వలిమై` ఫ్లాప్ కు ఓ కారణం కాగా.. తెలుగులో హ్యూజ్ ఫ్యాన్ బేస్ వున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` కు పోటీగా విడుదల కావడం మరో కారణం. పవన్ క్రేజ్ సునామీ కారణంగా అజిత్ `వలిమై` బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయిందని, ఆ కారణంగానే భారీ మూల్యాన్ని చెల్లించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.