Begin typing your search above and press return to search.
'వలిమై' పవర్ ప్యాక్డ్ ట్రైలర్: యాక్షన్ లో అజిత్ కు ధీటుగా నిలిచిన కార్తికేయ..!
By: Tupaki Desk | 30 Dec 2021 2:34 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు తమిళంతో పాటుగా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ కాబడి ఇక్కడ కూడా విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''వలిమై'' ను తెలుగులో 'బలం' అనే పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'వలిమై' చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - మోషన్ పోస్టర్స్ - టీజర్ మరియు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూస్తుంటే ఇదొక బైక్ రేస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
ఓ బస్ ఛేజింగ్ సీన్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో అజిత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. అయితే ఓ మర్డర్ కేసును ఛేదించే క్రమంలో అతని జీవితం తలక్రిందులు అయినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో అతన్ని సస్పెండ్ చేయడమే కాదు.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసి సొంత డిపార్ట్మెంట్ వాళ్లే వెంబడిస్తున్నారు.
కాప్ డ్రామా అయినప్పటికీ ట్రైలర్ లో బైక్ రేసింగ్ నేపథ్యంలో జరిగే యాక్షన్ ను ప్రధానంగా చూపించారు. ఇందులో అజిత్ కు ఛాలెంజ్ విసిరే పవర్ ఫుల్ విలన్ గా రేసర్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కనిపిస్తున్నారు. డిఫెరెంట్ మెకోవర్ లో స్టైలిష్ లుక్ లో Rx100 హీరో ఆకట్టుకున్నాడు. అజిత్ ఎప్పటిలాగే తన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దర్శనమిచ్చాడు. అజీత్ - కార్తికేయ మధ్య మైండ్ గేమ్ - యాక్షన్ సన్నివేశాలు - రేసింగ్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవబోతున్నాయని అర్థం అవుతోంది.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా.. తోటి పోలీసాఫీసర్ గా కనిపించింది. బాణీ - సుమిత్ర - అచ్యుంత్ కుమార్ - యోగి బాబు - రాజ్ అయ్యప్ప - పుగజ్ ఇతర పాత్రలు పోషించారు. 'వాలిమై' చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ - విజువల్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్ కుమార్.. ఇందులో రిస్కీ ఛేజింగ్ సీన్స్ చేసినట్లు తెలుస్తోంది.
యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - నిరావ్ షా కెమెరా వర్క్ 'వాలిమై' ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా.. విజయ్ వెలుకుట్టి ఎడిటింగ్ వర్క్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
'నెర్కొండ పార్వై' తర్వాత అజిత్ కుమార్ - డైరెక్టర్ వినోద్ - నిర్మాత బోనీ కపూర్ కలయికలో వస్తున్న సినిమా ''వలిమై''. 2022 సంక్రాంతి కానుకగా తమిళంతో పాటుగా తెలుగు - హిందీ బాషల్లో విడుదల కానుంది. తాజాగా వచ్చిన ట్రైలర్ తో ఈ మూవీపై అంచాలను రెట్టింపు అయ్యాయి. మరి ఈ మోటర్ బైక్ యాక్షన్-థ్రిల్లర్ అజిత్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.