Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ 100 కోట్ల సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అలర్ట్
By: Tupaki Desk | 12 March 2022 2:32 PM GMTతమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వాలిమై సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతకు మించిన వసూళ్లు రాబడుతుందని అంతా భావించారు. కాని ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాలేదు అనేది కోలీవుడ్ ట్రేడ్ వర్గాల మాట.
వాలిమై సినిమాలో తెలుగు నటుడు కార్తికేయ కీలక పాత్ర లో నటించడం వల్ల టాలీవుడ్ లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా విడుదల సమయం లో జనాలు పెద్దగా పట్టించుకో లేదు. తెలుగు లో ఒక మోస్తరు వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి.
అందుకు కారణం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కూడా అని ఒక ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమాలో దర్శకుడు వినోద్ హెచ్ చూపించే ప్రయత్నం చేశాడు.
బోనికపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అజిత్ యాక్టింగ్ మరో సారి ఆయన అభిమానులకు కన్నుల విందు చేసింది. హీరోయిన్ గా హ్యుమా ఖురేషి నటించగా.. ఈ సినిమాలో అజిత్ పోలీస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 వారు కొనుగోలు చేశారు.
వారు ఈ సినిమాను థియేటర్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. గత నెల చివర్లో విడుదల అయిన ఈ సినిమాను ఈనెల 25 వ తారీఖున భారీ ఎత్తున ఒకే సారి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
థియేటర్ స్క్రీనింగ్ చేయలేక పోయిన వారు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవ్వొచ్చు. ప్రముఖ ఓటీటీ ల్లో ఈ మధ్య భారీ ఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వాలిమై కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా ఈ సినిమా కనీసం డిజిటల్ ప్లాట్ ఫారంలో అయినా పర్వాలేదు అనిపిస్తుందా.. లేదంటే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.