Begin typing your search above and press return to search.

అమ్మాయిల్ని స‌ప్ల‌య్ చేసే బ్రోక‌ర్లు!?

By:  Tupaki Desk   |   8 Jan 2019 5:55 AM GMT
అమ్మాయిల్ని స‌ప్ల‌య్ చేసే బ్రోక‌ర్లు!?
X
ఆ న‌లుగురు .. థియేట‌ర్ల క‌బ్జా గురించి `పేట‌` నిర్మాత పోరాటం గురించి తెలిసిందే. ర‌జ‌నీ సినిమాకే థియేట‌ర్లు ఇవ్వ‌కుండా అరాచ‌కం చేస్తున్నార‌న్న‌ది ఆయ‌న వాద‌న‌. ఆ క్ర‌మంలోనే ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన పేట ఈవెంట్ లో ప‌రుష ప‌ద‌జాలంతో తీవ్రంగా ఆ న‌లుగురుని విమ‌ర్శించారు. న‌యీమ్ లా కాల్పిపారేయాల‌ని - కుక్క‌లు అని మాట్లాడారు.. ?? ఇదే విష‌యాన్ని ఓ ప్ర‌ముఖ యూట్యూబ్ చానెల్ వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌కు అశోక్ వ‌ల్ల‌భ‌నేని అంతే ఘాటుగా స్పందించారు.

సినీప‌రిశ్ర‌మ‌లో వీళ్ల వ్య‌వ‌హారంపై ఎంద‌రో నిరాహార దీక్ష‌లు చేశారు. కానీ ఇంత‌కాలం ఎవ‌రూ ఇంత తీవ్ర‌స్థాయిలో స‌మ‌స్య‌ను బ‌య‌ట‌కు తీసుకురాలేదు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప్యాష‌న్ తో వ‌స్తారు. ధ‌నార్జ‌న కోస‌మే కాదు. ఇదివ‌ర‌కూ `న‌వాబ్` చిత్రానికి థియేట‌ర్లు లేక స‌మ‌స్య ఎదుర్కొన్నా. అయినా ర‌జ‌నీపై అభిమానంతో పేట చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని తీసుకున్నా. ఆయ‌న స్ఫూర్తితో నా తండ్రి క‌ళ్ల‌ను దాన‌మిచ్చాను. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశాను. ఆయ‌న స్ఫూర్తితో ఎన్నో సినిమాలు తెస్తున్నా. థియేట‌ర్ల స‌మ‌స్య ఉన్నా ర‌జ‌నీ స్ఫూర్తితోనే చేస్తున్నా. ఓవ‌ర్సీస్ లో జ‌పాన్ - చైనాలో మార్కెట్ రావ‌డానికి కార‌ణం ర‌జ‌నీకాంత్. తెలంగాణ‌ గ‌వ‌ర్న‌మెంట్ ఎన్నో మంచి ప‌నులు చేస్తోంది. ఎన్నో మంచి ప‌నులు చేసిన కేసీఆర్ గారు.. న‌యీమ్ ని చంపించి ఎంతో మేలు చేశారు. న‌యీమ్ కంటే వీళ్లు ఏమాత్రం త‌క్కువ కాద‌ని నా అభిప్రాయం అనీ అన్నారు. ఈసారి కూడా థియేట‌ర్లు లేకుండా చేశారు. థియేట‌ర్లు లేకుండా డిస్ట్రిబ్యూట‌ర్లు ఎవ‌రూ ముందుకు రారన్న‌ది తెలిసిందే. ర‌జ‌నీ సినిమాకే ఈ ప‌రిస్థితా? చిన్న సినిమాల్ని బ‌త‌క‌నిస్తున్నారా? పెద్ద సినిమాల పేరుతో థియేట‌ర్ల‌ను బ్లాక్ చేసేస్తే బావున్న మంచి సినిమాలు - చిన్న సినిమాల ప‌రిస్థితేంటి? ఇండ‌స్ట్రీలో (బీఫ్ సౌండ్) అమ్మాయిల్ని స‌ప్ల‌య్ చేసే బ్రోక‌ర్లు సినిమా నిర్మాత‌లు (మ‌రికొంద‌రు అనే అర్థంలో) గా ఉంటే ఇలానే ఉంటుంది... ఇలాంటి పెద్ద నిర్మాత‌లు ఎంద‌రో.. వాళ్లేం మాట్లాడ‌తారు థియేట‌ర్ల స‌మ‌స్య గురించి..!! అంటూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లే చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

ప్ర‌భుత్వ‌మే ఈ విష‌యాల్లో న్యాయం చేయాలి. దీనిపై నేను కోర్టు కెళ‌తాను.. ప్ర‌భుత్వాన్ని క‌లుస్తాను. అన్ని ప్ర‌త్యామ్నాయాల్ని వెతుకుతాను. జ‌రిగిన అన్యాయానికి ఈ య‌ద‌వ‌.. నా..ళ్ల‌ను వ‌ద‌ల‌ను!! అని పేట నిర్మాత‌ తీవ్ర ప‌ద‌జాలంతో వ్యాఖ్యానించారు. ఉద్య‌మంలా ముందుకెళ‌తారా అని ప్ర‌శ్నిస్తే... ``ఉద్య‌మం చేస్తాను. అయితే ఎక్కువ మంది అట్టాంటి.. కొ..(ఎక్స్) లే కాబ‌ట్టి వారి గురించి ఏం మాట్లాడ‌తాను. అయినా నాకు వాళ్ల లొసుగుల‌న్నీ తెలుసు. వాళ్ల తాట తీస్తాను. తీస్తే ఆటోమెటిగ్గా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. అయినా ర‌జ‌నీకాంత్ అంటే ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్. మ‌నం ఏదైనా పాకిస్తాన్ లో ఉన్నామా? థియేట‌ర్లు ఇవ్వ‌రా? అని వ్యాఖ్యానించారు. ``అల్లు అర్జున్ కి ఎంత మార్కెట్ ఉంది. ఆయ‌న‌కు త‌మిళం - మ‌ల‌యాళంలో మార్కెట్ లేదా? దానికి వంక పెట్టారా ఎవ‌రైనా? ఇత‌ర రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు క‌దా? ఊరికే డిస్ట్రిబ్యూష‌న్ చేస్తున్నారా? కోట్ల‌కు కోట్లకు అమ్ముకోవ‌డం లేదా? కోట్ల‌కు కోట్లు దొ(ఎక్స్)తున్నారు క‌దా? అంటూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇక ర‌జ‌నీ `పేట‌` కంటెంట్ బావుంటే ప్రేక్ష‌కులే విజ‌యాన్ని అందిస్తార‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు.