Begin typing your search above and press return to search.
లైవ్ డిబేట్ లో నోరు జారుడు!
By: Tupaki Desk | 8 Jan 2019 7:17 AM GMTరజనీకాంత్ `పేట` థియేటర్ వార్ అంతకంతకు రచ్చకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనవరి 10న రిలీజవుతున్న ఈ సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా ఆ నలుగురు నలిపేస్తున్నారని వల్లభనేని అశోక్ ఇటీవల ఓ లైవ్ ఈవెంట్ లో కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి యుద్ధం పరాకాష్టకు చేరుతోంది. `పేట` చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ధియేటర్ లని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని మాఫియాగా వ్యవహరిస్తున్న ఆ నలుగురిని నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన అశోక్ వల్లభనేని తాజాగా ప్రముఖ టీవీ చానెల్ చర్చా వేదికలో అదే తీరుగా సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ధియేటర్ మాఫియాకు సంబంధించి చర్చాకార్యక్రమంలో ఆయన మధ్యలోనే లేచి వెళ్లిపోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.
వార్తా చానెల్ లైవ్ లో పాల్గొన్న వల్లభనేని అశోక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అల్లు అరవింద్ - దిల్ రాజు - సురేష్ బాబు - యువీ నిర్మాతల్ని కుక్కలతో పోల్చిన ఆయన మరింత హద్దులు దాటి మాట్లాడటం వేడెక్కిస్తోంది. ఆ నలుగురు(దిల్ రాజు - యువి క్రియేషన్స్ - అల్లు అరవింద్ తదితరులు)ని చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. అద్దాల మేడల్లో ఉన్న వీళ్లను .... పగలగొట్టే రోజొస్తుంది`` అంటూ చర్చ మధ్యలోనే రుసరుసలాడుతూ ఆయన లేచి వెళ్లిపోయారు.
ఈ లైవ్ కార్యక్రమానికి చాలా ముందే బన్ని వాసు (అల్లు అరవింద్ తరపున) ఫేస్ బుక్ లో ఆసక్తికర వ్యాఖ్యను పోస్ట్ చేశారు. ``తిట్టాలి అనుకుంటే మేం సంస్కారం అనే హద్దును మాత్రమే దాటడం మాత్రమే మిగిలి ఉంది`` అని వ్యాఖ్యను చేశారు. అలాగే నిన్నటిరోజున `ఎఫ్ 2` ట్రైలర్ వేడుకలో దిల్ రాజు సైతం ఎంతో డిగ్నిఫైడ్ గా సదరు నిర్మాత వ్యాఖ్యల్ని ఖండించారు. ``మేం అలాంటి పని చేయం. మాకు ఒక క్యారెక్టర్ ఉంది!`` అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లైవ్ డిబేట్ లపై ఫిలింనగర్ లో వేడెక్కిపోయే చర్చ సాగుతోంది. పబ్లిక్ వేదికలపై మాట్లాడేప్పుడు పరుష పదజాలం ఉపయోగించడాన్ని ఎవరూ సహించరు. పరిస్థితి చూస్తుంటే అదుపు తప్పుతోందనే సదరు నిర్మాతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.