Begin typing your search above and press return to search.

తొంభైలలోకి వెళ్ళిపోయిన వాల్మీకి జోడీ

By:  Tupaki Desk   |   2 Sep 2019 10:07 AM GMT
తొంభైలలోకి వెళ్ళిపోయిన వాల్మీకి జోడీ
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'వాల్మీకి'. ప్రోమోస్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని కలిగించాయి. వరుణ్ మేకోవర్ అందరినీ ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే వరుణ్ సరసన నటిస్తోంది.

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ రోజు 'వాల్మీకి' టీమ్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్.. పూజా హెగ్డే ఇద్దరూ రెట్రో స్టైల్ లో ఉండడం విశేషం. లంగా ఓణీ ధరించిన పూజ రెండు జడలు వేసుకుని.. వాటికి రిబ్బన్లు కట్టుకుని అచ్చమైన తెలుగు అమ్మాయి టైపులో రెడీ అయింది.. మరోవైపు వరుణ్ తేజ్ మాత్రం పొడవాటి కాలర్లు ఉండే పాతకాలం స్ట్రైప్స్ ఉండే షర్టు ధరించి ఒక డాబా మీద కూర్చుని పూజను చూస్తూ ఉన్నాడు.

ఈ పోస్టర్ లో పూజా పాతకాలం టీవీ యాంటెనాను సిగ్నల్స్ కోసం అటూ ఇటూ కదిలిస్తూ ఉంది. ఈ జెనరేషన్ వారికి యాంటెనా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఓ పాతికేళ్ళపై బడిన వయసు వారికి తెలిసే అవకాశం ఉంటుంది. కేబుల్ టీవీ విప్లవం ప్రారంభం కాకమునుపు డీడీ ఛానెల్ నే చూసి హిందీ నేర్చుకున్న జెనరేషన్ వారు అందరూ దాదాపు ఈ ఇలాంటి యాంటెనాను ఏదో ఒక సందర్భంలో తిప్పి ఉంటారు!

యాంటెనా సంగతి పక్కన పెడితే ఈ సినిమా తమిళ సూపర్ హిట్ 'జిగార్తాండ' కు రీమేక్ గా తెరకెక్కుతోంది. 'వాల్మీకి' లో తమిళ హీరో అథర్వ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్. రామ్ ఆచంట.. గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 'వాల్మీకి' సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.