Begin typing your search above and press return to search.
కింగ్ ఖాన్ వ్యాపార సామ్రాజ్యం విలువ ఎంత?
By: Tupaki Desk | 29 May 2022 2:30 AM GMTకింగ్ ఖాన్ షారూక్ దేశంలో వేలకోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏకైక స్టార్ అన్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లో అతడికి ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా లండన్‌లో రూ. 172 కోట్ల విల్లా అతడి సొంతం. అలాగే తన ముంబై ఇల్లు మన్నత్ కి వజ్రాలు పొదిగిన నేమ్ ప్లేట్ ని ఏర్పాటు చేసాడంటే అతడి విలాసాలు సంఘంలో స్టాటస్ ఏ రేంజులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
షారుఖ్ ఖాన్ ను బాలీవుడ్ బాద్షా అని పిలవడానికి కారణం.. అతడి లైఫ్ స్టైల్. అతను కింగ్ సైజ్ జీవితాన్ని ఆస్వాధిస్తాడు. టాప్ టు బాటమ్ అతడు ఉపయోగించేవన్నీ విలాసవంతమైన వస్తువులే. ఎందులోనూ అతడు రాజీకి రాడు.
షారూఖ్ ఖాన్ ఖరీదైన మన్నత్ నేమ్‌ప్లేట్
ముంబైలోని షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ పర్యాటక ఆకర్షణగా మారింది. చాలామంది బాంద్రాను సందర్శిస్తారు. అక్కడ కింగ్ ఖాన్ ఇంటి వెలుపల నిలబడి మన్నత్ ని వీక్షించేందుకు పోటీపడుతుంటారు. ఇటీవల SRK - అతని భార్య గౌరీ ఖాన్ తమ ఇంటి నేమ్ ప్లేట్ ను మార్చడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం నేమ్ ప్లేట్ విలువ రూ.25 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే ఈ నేమ్‌ప్లేట్ కనిపించకుండా పోవడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్లేట్ నుండి వజ్రం పడిపోయినందున మరమ్మత్తు పని కోసం దానిని తొలగించినట్లు తెలుస్తోంది. 25 లక్షల విలువైన నేమ్‌ప్లేట్ ఏంటో కానీ బాద్ షాకి మరీ అంత ప్రెస్టేజ్ దేనికో అంటూ అభిమానులు మాట్లాడుకుంటారు. షారుఖ్ ఖాన్ లైఫ్ లో మన్నత్ మాత్రమే కాదు.. ఇతర ఖరీదైన వస్తువులు ఎన్నో ఉన్నాయి.
లండన్ లోని షారూఖ్ ఖాన్ ఇల్లు
తాజా కథనాల ప్రకారం.. షారుఖ్ ఖాన్ లండన్ లోని ఒక పోష్ ఏరియాలో ఫాన్సీ నంబర్ హౌస్ ని కలిగి ఉన్నాడు. ఈ అందమైన విల్లా విలువ రూ. 172 కోట్లు.
షారూఖ్ ఖాన్ వ్యానిటీ వ్యాన్
SRK లైఫ్ కింగ్ సైజ్. అతను కస్టమైజ్డ్ వానిటీ వ్యాన్ సహా అన్ని విలాసాలను అనుభవించేందుకు ఇష్టపడతాడు. దిలీప్ ఛాబ్రియా రూపొందించిన ఆయన వ్యానిటీ వ్యాన్ విలువ రూ. 4 కోట్లు.
దుబాయ్ లో షారూఖ్ ఖాన్ ఇల్లు
లండన్- ముంబై- అలీబాగ్ లతో పాటు దుబాయ్ లో కూడా షారూఖ్ కు ఆస్తి ఉంది. అతనికి దుబాయ్ లోని కె ఫ్రంట్ ఆఫ్ పామ్ జుమేరాలో జన్నత్ అనే ప్రైవేట్ ఐలాండ్ విల్లా ఉంది. ఈ విల్లా విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా.
లగ్జరీ కార్ కలెక్షన్
బాలీవుడ్ బాద్ షాకు ఖరీదైన కార్లను కొనుగోలు చేసే అలవాటు ఉంది. రూ. 12 కోట్ల విలువైన బుగాటీ వేరాన్ నుంచి రూ. 7 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే వరకు రకరకాల బ్రాండ్ల కార్లు అతడి గ్యారేజీలో ఉన్నాయి.
KKRలో షారూఖ్ ఖాన్ వాటా
ఐపీఎల్ టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్ లో షారూఖ్ ఖాన్ కు భారీ వాటా ఉంది. ఇది అతని అతిపెద్ద పెట్టుబడిలో ఒకటి. ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్ టన్ మెంట్ లో సినిమాలు నిర్మిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఖాన్ కి కొంతకాలంగా సరైన సక్సెస్ లేదు. కానీ అతడి ఆస్తుల వర్త్ ఏమాత్రం తగ్గలేదు. కింగ్ ఖాన్ వ్యాపార సామ్రాజ్యం విలువ ఎంత? అంటే వేల కోట్లు అన్న మాటే వినిపిస్తోంది.
అమెరికాలో 1000 కోట్లతో క్రికెట్ స్టేడియం
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించే ప్రణాళికల్లో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా USAలోని లాస్ ఏంజెల్స్ లో అత్యంత భారీ స్టేడియంని నిర్మించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. KKR సహ-యజమాని షారూఖ్ ఖాన్ క్రికెట్ స్టేడియంను నిర్మించబోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఓ సమావేశంలో కోల్ కతా నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్ స్టేడియంను నిర్మించనున్నట్లు ప్రకటించారు. రెండుసార్లు IPL చాంపియన్ లు గా కేకేఆర్ నిలిచింది. తాజా ప్రకటన అనంతరం పూర్తి వివరాల్ని సేకరించగా.. దీనికోసం భారీ బడ్జెట్ ని షారూక్ వెచ్చించనున్నారని తెలిసింది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆర్కిటెక్ట్ లు HKS ఒక అరేనాను డిజైన్ చేయనుంది. ప్రఖ్యాత నగరం గ్రేటర్ లాస్ ఏంజిల్స్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో బహుళ-మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ స్టేడియంని నిర్మిస్తారు.
ఫ్రాంచైజీ సహ-యజమాని షారూక్ నుండి వెలువడిన ప్రకటన ప్రకారం.. షారుఖ్ ఖాన్ - కరేబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్ బాగో నైట్ రైడర్స్ లో కూడా వాటాను కలిగి ఉన్నాడు. ఇందుకు సంబంధించిన డెవలప్ మెంట్ పైనా ఆయన ధృవీకరించారు. ఈ టై అప్ విషయమై ఆశాజనకంగా ఉన్నామని తెలిపారు. అమెరికా MLC లో మా పెట్టుబడి USAలో క్రికెట్ కి ఉత్తేజకరమైన ఊతమస్తుందని భావిస్తున్నాం. భవిష్యత్తుపైనే నమ్మకంగా ఉన్నాం. T20 క్రికెట్ లో నైట్ రైడర్స్ ను గ్లోబల్ బ్రాండ్ గా స్థాపించాలనే మా వ్యూహానికి అనుగుణమైన ప్రణాళిక ఇది అని SRK వెల్లడించారు. గ్రేటర్ లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించాలనే ప్రణాళిక మాకు మా MLCకి ఉత్తేజాన్నిచ్చింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అని ఖాన్ వ్యాఖ్యానించారు.
2024 పురుషుల T20 ప్రపంచ కప్ ను యునైటెడ్ స్టేట్స్ .. వెస్టిండీస్ లో కోహోస్టింగ్ చేయబోతున్నందున అట్లాంటిక్ మహాసముద్రం అంతటా జెంటిల్ మన్ గేమ్ కు భారీ వృద్ధి ఉంది. SRK.. KKR బ్రాండ్ లాస్ ఏంజిల్స్ లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గుర్తింపు పొందిన పిచ్ తో ముందుకు రావాలనే ప్రణాళిక ఉంది. గొప్ప టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రపంచ క్రికెట్ లో అత్యున్నత స్థాయి మ్యాచ్ లను నిర్వహించే వేదికను నిర్మిస్తామన్నారు. KKR ప్రణాళికలలో అత్యాధునిక శిక్షణా సౌకర్యాలుంటాయి. లాకర్ గదులు- లగ్జరీ సూట్లు- ప్రత్యేక పార్కింగ్- రాయితీలు- ఫీల్డ్ లైటింగ్ సహా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అథ్లెటిక్స్ లో అదరగొట్టే అమెరికాలో క్రికెట్ కి ఆదరణ అంతంత మాత్రమే. కానీ గ్లోబల్ ట్రెండ్ మారుతోంది. మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా అమెరికన్లు క్రికెట్ ని ఆరాధిస్తున్నారని ఖాన్ గ్రహించారు. అందుకే ఇప్పుడు అమెరికాలో క్రికెట్ వృద్ధికి కింగ్ ఖాన్ స్కెచ్ వేసారు. దాంతో పాటే భారీగా ఆర్జించే లక్ష్యాలను నిర్ధేశించారన్నమాట.