Begin typing your search above and press return to search.
షార్ట్ ఫిల్మ్ తీయనున్న వంశీ
By: Tupaki Desk | 10 Sep 2015 4:25 PM GMTఒక ప్రత్యేకమైన మార్క్ తో సినిమాలు తీసే దర్శకుడు వంశీ. నేటివిటీని ప్రతిబింబించే కథ, మనలో ఒకరిగా అనిపించే పాత్రలు, స్వచ్ఛమైన కామెడీ, మంచి సంగీతం... వీటన్నిటి కాంబినేషన్ తో అచ్చమైన తెలుగు సినిమాని తీస్తుంటాడు వంశీ. `మహర్షి`, `లేడీస్ టైలర్`, `ఏప్రిల్ 1 విడుదల`, `ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు`.. ఇలా ఆయన్నుంచి అపురూపమైన సినిమాలు చాలానే వచ్చాయి. వంశీ సినిమా అనగానే చూడాల్సిందే అని ఫిక్సయిపోయేవాళ్లు చాలామందే కనిపిస్తుంటారు. వంశీ ప్రేక్షకులపై వేసిన ముద్ర అలాంటిది. ఒకప్పుడు వరుసగా సినిమాలు తీసి విజయాలు సొంతం చేసుకొన్న ఆయన కొంతకాలంగా వేగం తగ్గించారు. సరైన సినిమాలు ఆయన్నుంచి రావడం లేదు. ఆమధ్యన `మెల్లగా తట్టింది మనసు తలుపు` అనే సినిమాని తీశాడు. కానీ అది ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు సడన్‌గా ఆయన `లెటర్` పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని డిసైడ్ అయ్యాడు. వంశీ తీస్తున్న మొట్టమొదటి షాట్ ఫిల్మ్ ఇది. ఇప్పుడుంతా డిజిటల్ యుగం. లెటర్ లు రాసుకోవడాలు తగ్గిపోయాయి. ఏ కబురయినా ఫోన్లు, మెయిళ్ల ద్వారానే చేరవేసుకొంటుంటారు. కానీ ఈ పరిస్థితుల్లో వంశీ `లెటర్` పేరుతో షార్ట్ ఫిల్మ్ తీస్తానంటుండడం విశేషమే. తొలిసారి తాను షార్ట్ ఫిల్మ్ తీయనున్నట్టు స్వయంగా ప్రకటించారు వంశీ.
కొంతకాలంగా వంశీ `ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్` అనే సినిమాని తీస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో ప్రచారం సాగుతోంది. మొదట్లో రవితేజతో ఆ సినిమా తీస్తాడని అన్నారు. కానీ ఆ ప్రాజెక్టు వర్కవుట్ అవ్వలేదు. రవితేజ స్థానంలో ఇప్పుడు రాజ్ తరుణ్ ని ఎంపిక చేసుకొన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇంతలో వంశీ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్టు ప్రకటించాడు. మరి `ఫ్యాషన్ డిజైనర్` ఉన్నట్టా లేనట్టా అన్నది సందేహంగా మారింది. వంశీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ `లేడీస్ టైలర్`కి సీక్వెల్ గా `ఫ్యాషన్ డిజైనర్` సినిమాని తీయాల్సిందే అని డిసైడై కథని సిద్ధం చేసుకొన్నాడు. అది చాలా మంది హీరోలకి వినిపించినట్టు తెలుస్తోంది. మరి ఆ కథకు ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో చూడాలి.