Begin typing your search above and press return to search.

అలాంటి వంశీకి ఇలాంటి పరిస్థితా?

By:  Tupaki Desk   |   5 Feb 2016 7:30 PM GMT
అలాంటి వంశీకి ఇలాంటి పరిస్థితా?
X
1980, 90లలో తెలుగు సినిమా పరిశ్రమని ఏలిన నలుగురు దర్శకులలో వంశీ ఒకడు. కే విశ్వనాద్ - జంధ్యాల - బాపు ల తరువాత తెలుగుదనం ఉట్టిపడే సినిమాలు తీయడం వంశీ టాలెంట్. ఏప్రిల్ ఒకటి విడుదల - చెట్టుకింద ప్లీడరు - లేడీస్ టైలర్ - అన్వేషణ ఇలా ఎన్నో మరపురాని మ్యూజికల్ హిట్స్ ని అందించాడు వంశీ.

ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారుతో సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం మెప్పించిన వంశీకి ప్రస్తుతం కష్టకాలం నడుస్తుంది. ప్రతిష్టాత్మకంగా విడుదలకావలసిన తన 25వ సినిమా వాయిదాలు పడుతూ ఎటువంటి ప్రచారం లేకుండా ఈరోజు విడుదలకు సిద్ధపడింది. తను మొన్నే వెళ్ళిపోయింది అన్న టైటిల్ ని ముందుగా పెట్టినా దాన్ని రీసెంట్ గా వెన్నెల్లో హాయ్ హాయ్ గా మార్చారు.

రంగం సినిమాతో మనకు పరిచయమైన అజ్మల్ ఈ సినిమాకు హీరో. ఈ చిత్ర విడుదల పోస్టర్ లలో వంశీ ఫిల్మోగ్రఫీ అంతా వేసి సూపర్ హిట్లు తీసిన డైరెక్టర్ నుండి మరో సినిమా అని సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఈ సినిమా గనుక మంచి విజయం సాధించి పాత వంశీని తలపిస్తే ఆయనకీ మంచిరోజులు ఎంతో దూరంలో లేవు. అలాంటి వంశీకి ఇలాంటి పరిస్థితా?