Begin typing your search above and press return to search.

మ‌హేష్ తో మిస్‌.. బ‌న్నీతో కూడా లేన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   5 April 2021 2:30 AM GMT
మ‌హేష్ తో మిస్‌.. బ‌న్నీతో కూడా లేన‌ట్టేనా?
X
‘మహర్షి’ సినిమాకు జాతీయ అవార్డు గెలుచుకున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఆ సినిమా వ‌చ్చి రెండేళ్లు దాటింది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంశీ నెక్స్ట్ ప్రాజెక్టు ఏంట‌న్న‌ది క‌న్ఫామ్ కాలేదు. నిజానికి.. త‌ర్వాతి సినిమా కూడా మ‌హేష్ తోనే ప్లాన్ చేశాడు వంశీ. అయితే.. క‌థ విష‌యంలో సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో ప్రిన్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌నే టాక్ వ‌చ్చింది.

ఆ త‌ర్వాత మ‌రో స‌మాచారం చ‌క్క‌ర్లు కొట్టింది. అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడన్న‌ది దాని సారాంశం. కేజీఎఫ్ లాంటి బ్యాక్ డ్రాప్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను సిద్ధం చేశాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ స్టోరీ విన్న‌ బన్నీ హ్యాపీగా ఓకే చెప్పాడ‌ని ప్ర‌చారంసాగింది. ఆ త‌ర్వాత అల్లు అర‌వింద్ కు కూడా వినిపించాడ‌ని, ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ స‌మాచారం.

కానీ.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ప్ర‌స్తుతం పుష్ప‌తో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. వ‌చ్చే ఆగ‌స్టులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ త‌ర్వాత వెంట‌నే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా లైన్లోకి రానుంది. అది పూర్త‌య్యే స‌రికి వ‌చ్చే ఏడాది వ‌చ్చేస్తుంది.

ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ లైన్లో ఉన్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. కేజీఎఫ్ టైమ్ లోనే బ‌న్నీతో సినిమా చేయ‌డానికి ప్ర‌శాంత్ అంగీక‌రించాడ‌ని, క‌థ‌ కూడా సిద్ధం అవుతోంద‌ని అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వంశీ పైడిప‌ల్లికి చోటు ఎప్పుడు? ఎక్క‌డ అనేది అతిపెద్ద డౌట్‌. అయితే.. బ‌న్నీ ఛాన్స్ ఇవ్వాల‌నుకుంటే.. ఇది స‌మ‌స్య కూడా కాక‌పోవ‌చ్చు. మ‌రి, ఏం జరుగుతుంద‌న్న‌ది చూడాలి.