Begin typing your search above and press return to search.

అఖిల్ సెకండ్ కి.. అప్పుడే బ్యాండ్?

By:  Tupaki Desk   |   5 April 2016 3:45 AM GMT
అఖిల్ సెకండ్ కి.. అప్పుడే బ్యాండ్?
X
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున - కార్తీల మల్టీస్టారర్ మూవీ ఊపిరి.. రిలీజ్ రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. రెండో వీకెండ్ నాటికే 35 కోట్ల షేర్ వసూళ్లను సాధించి.. సేఫ్ ప్రాజెక్ట్ దిశగా దూసుకుపోతోంది. అయితే.. ఊపిరి ఈ రేంజ్ హిట్ అయినా సరే, వంశీ పైడిపల్లి మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా నోరు మెదపడం లేదు.

అఖిల్ హీరోగా నటించే రెండో చిత్రానికి వంశీ పైడిపల్లినే దర్శకుడిగా ఫిక్స్ చేశారనే టాక్ వినిపించింది. బాలీవుడ్ మూవీ 'యే జవానీ హై దివానీ'ని తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్ణయించారని, ఈ ప్రాజెక్టుని- అఖిల్ కి హిట్ ఇచ్చే బాధ్యతను వంశీకే అప్పగించారని అన్నారు. అయితే.. ఇప్పుడీ ప్రాజెక్టును టేకప్ చేసేందుకు వంశీ పైడిపల్లి సిద్దంగా లేడని తెలుస్తోంది. ఊపిరి రీమేక్ కావడం, మళ్లీ రీమేక్ సినిమానే చేస్తే.. తనను రీమేక్ ల దర్శకుడిగా బ్రాండ్ వేస్తారనే ఆలోచనతోనే.. అఖిల్ సినిమాను వదులుకునే ఆలోచనలో ఉన్నాడట ఈ డైరెక్టర్.

కొత్త స్టోరీతో తీయమంటే ఆన్సర్ ఏం చెబుతోడో కానీ.. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. జూనియర్ కి సరిపోయే స్టోరీ ఇప్పటికే ఈ దర్శకుడి దగ్గర సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాలతో జనతా గ్యారేజ్ చేస్తున్న యంగ్ టైగర్.. దీని తర్వాత హను రాఘవపూడితో కానీ, పూరీ జగన్నాథ్ తో కానీ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మరి అవి పూర్తయ్యేవరకూ వంశీ ఆగుతాడో.. లేక అఖిల్ వైపే మొగ్గుతాడో ఇంకా తేలలేదు.